సీటు మార్చాలన్న ఆనం.. నవ్వుకున్న జగన్? ఎందుకు?

  సీటు మార్చాలన్న ఆనం.. నవ్వుకున్న జగన్? ఎందుకు?

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అంచనాలకు తగ్గట్లే.. సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేసి లబ్థి పొందాలన్నట్లుగా విపక్ష టీడీపీ వ్యవహరిస్తుంటే.. వారి తీరును నిశితంగా విమర్శిస్తూ అధికారపక్షం నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఇటీవల ఏపీ సీఎం జగన్ కు.. మంత్రి ఆనంకు మధ్య ఏదో తేడా వచ్చిందని.. వారి మధ్య గ్యాప్ పెరిగిందంటూ వార్తలు రావటం తెలిసిందే. అయితే.. ఆ వార్తల్లో ఏ మాత్రం పస లేదన్న విషయం సోమవారం అసెంబ్లీ సమావేశాల్ని చూసినంతనే అర్థం కాక మానదు.

ప్రశ్నోత్తరాల వేళ విద్యుత్ ఒప్పందాలపై చర్చ జరుగుతోంది. దీనిపై టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. దీనిపై మంత్రి ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆందోళన చేసే సరికొత్త సంప్రదాయాన్ని విపక్షం చేపట్టటాన్ని తప్పు పట్టారు.  విద్యుత్ ఒప్పందాలపై ప్రభుత్వం ఇచ్చిన సమాధానం సరైనదని.. టీడీపీ నేతలు చేస్తున్న వాదన ఏ మాత్రం సరికాదన్నారు. ఇదిలా ఉండగా.. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఆద్యంతం ఆకట్టుకునేలా సాగాయి.

సభలోని సభ్యుల్ని నవ్వుల్లో ముంచెత్తాయి.  "దయచేసి నా సీటు మార్చండి సార్.. సభ్యులు ఎవరైనా మాట్లాడితే మాట్లాడతాను. కానీ.. ప్రతిపక్ష నేతే స్వయంగా నా పక్కన నిలబడితే నేనేం మాట్లాడగలను సార్? ఆయన నా పక్కన నిల్చున్నా.. కూర్చున్నా మాట్లాడేంత ధైర్యం.. శక్తి నాకున్నాయా సార్? వారి ముందు నేనుచాలా చిన్నవాడ్ని. వారొచ్చి నా పక్కన నిలుచుంటే నేనేం మాట్లాడగలనంటూ వ్యాఖ్యానించారు. ఆనం మాటలకు సీఎం జగన్ నవ్వుతూనే ఉన్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు అధికారపక్ష నేతలు సైతం నవ్వు ఆపుకోలేకపోయారు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English