నిర్భ‌య ఆత్మ‌శాంతి చేకూరేలా...ఆ రోజే వారిని ఉరితీస్తార‌ట‌

 నిర్భ‌య ఆత్మ‌శాంతి చేకూరేలా...ఆ రోజే వారిని ఉరితీస్తార‌ట‌

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన నిర్భ‌య ఘ‌ట‌న‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. నిర్భయ కేసులో నలుగురు దోషుల ఉరిశిక్ష అమలుకు రంగం సిద్ధమైంది. 16వ తేదీ సోమవారం ఉదయం 5 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు తిహార్‌ జైలు అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో దిశ సంఘటన తర్వాత దేశ వ్యాప్తంగా అత్యాచారాలు, హత్యలపై నిరసనలు వెల్లువెత్తాయి.

దీంతో వినయ్ శర్మ పిటిషన్ ను రిజెక్ట్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకుంది. ఇదే నిర్ణయాన్ని సమర్థిస్తూ శుక్రవారమే కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి రికమెండ్ చేసింది. దీనిపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి ముందే వినయ్ శర్మ పిటిషన్ ను వెనక్కి తీసుకోవడం విశేషం. ఇలా న్యాయ‌సంబంధ అంశాల‌న్నీ క్లియ‌ర్ అవ‌డంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వ‌చ్చాయి. మ‌రోవైపు జైలు అధికారులు ఉరితీసేందుకు త‌గు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరణశిక్షల కేసుల్లో అన్ని అప్పీళ్ల తర్వాత చివరిగా రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడానికి నిందితులకు అవకాశం ఉంటుంది. అది కూడా పూర్తయితే రాష్ట్రపతి నిర్ణయాన్ని బట్టి శిక్షను అమలు చేస్తారు. క్షమాభిక్షను ఆమోదిస్తే యావజ్జీవ శిక్షగా మారుస్తారు. నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నిందితుల్లో ముగ్గురు అసలు క్షమాభిక్షను కోరలేదు. వినయ్ శర్మ ఒక్కడి పేరుతోనే అప్లికేషన్ రావడంతో శిక్షల అమలు పెండింగ్ లో పడింది.  

అయితే, మరణశిక్ష పడకుండా క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి చేసుకున్న పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు దోషి వినయ్ శర్మ శనివారం లెటర్ రాశాడు. అసలు తాను మెర్సీ పిటిషన్ పెట్టలేదని అందులో రాశాడు. తన పేరుతో వచ్చిన పిటిషన్ లో తాను సంతకం చేయలేదని పేర్కొన్నాడు. దీంతో నిర్భ‌య‌ కేసులో శిక్ష అమలుకు ఉన్న అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి.

2012 డిసెంబర్‌ 16న ఆరుగురు కలిసి నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. అయితే ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడిన డిసెంబర్ 16 నే నలుగురు దోషులను ఉరి తీస్తుండటం విశేషం.  దోషుల్లో ఒకరు జూవైనల్‌ కస్టడీలో ఉండగా.. మరో దోషి రామ్‌సింగ్‌ జైలులోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. మిగిలిన న‌లుగురికి ఆమెను చెర‌బ‌ట్టిన రోజే అధికారులు క‌ఠిన శిక్ష అమ‌లు చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English