టీవీ 9 ర‌జ‌నీకాంత్ మీద ఒట్టేసి చెప్పిన వ‌ర్మ‌

టీవీ 9 ర‌జ‌నీకాంత్ మీద ఒట్టేసి చెప్పిన వ‌ర్మ‌

సంచ‌లన ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ నిర్మాణంలో సిద్ధార్థ్ తాతోలు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప బిడ్డలు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి లెక్క‌లేన‌న్ని వివాదాల‌తో న‌డుస్తోంది. ముందు నుంచి ఈ సినిమాపై టీడీపీ వాళ్లు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. ఇక టైటిల్‌పై కూడా పెద్ద గొడ‌వ న‌డిచింది. చివ‌ర‌కు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసే వ‌ర‌కు ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌ని వ‌ర్మ చివ‌ర‌కు సెన్సార్ విష‌యంలో మాత్రం లొంగ‌క త‌ప్ప‌లేదు.

సెన్సార్ అభ్యంత‌రం చెప్ప‌డంతో వ‌ర్మ త‌న టైటిల్‌ను అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లుగా మార్చాడు. సెన్సార్ బోర్డు కొన్ని క‌ట్స్‌తో పాటు టైటిల్ మార్చ‌డంతో చివ‌ర‌కు యూ / ఏ స‌ర్టిఫికెట్ జారీ చేసింది. ఇక ఈ సినిమ స్టిల్స్‌, టీజ‌ర్లు, ట్రైల‌ర్లు చూస్తుంటే ఏపీ రాజ‌కీయాల గురించి.. ముఖ్యంగా టీడీపీని ఈ సినిమా టార్గెట్ చేసిన‌ట్టుగా స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే త‌న‌కు అల‌వాటైన విధంగానే వ‌ర్మ ఈ సినిమా గురించి చాలా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

త‌న జీవితంలో తొలిసారిగా వాస్త‌వాన్ని చూపించాన‌ని కూడా వ‌ర్మ ప్ర‌క‌టించాడు. ఇక ఈ నెల 12న ఈ సినిమా రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వ‌ర్మ ఈ సారి టీవీ 9 ర‌జ‌నీకాంత్ మీద ప‌డ్డాడు. టీవీ 9 మాజీ సీఈవో రజ‌నీకాంత్‌పై ఒట్టేసి చెపుతున్నా.. క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు గురించి నిజం మాత్ర‌మే చెపుతున్నాన‌ని ట్వీట్ట‌ర్‌లో చెప్పాడు. ఇక ఈ సినిమా సెన్సార్ అయ్యాక‌.. ఈ దేశంలో భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ ఉంద‌ని తొలిసారిగా నాకు తెలిసిందంటూనే... ఈ సినిమా సెన్సార్ స‌ర్టిఫికెట్‌ను కేఏ. పాల్ త‌న‌కు ఇస్తున్న‌ట్టుగా ఓ మార్ఫింగ్ కూడా పెట్టాడు.

ఇక ఇప్పుడు ఉరిమి ఉరిమి మంగ‌ళం మీద ప‌డ్డ‌ట్టు టీవీ 9 మాజీ అయిన ర‌జ‌నీకాంత్‌ను ఎందుకు టార్గెట్ చేశాడో ?  మాత్రం ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. ఇక సినిమాలో ఇప్ప‌టికే చాలా రోల్స్ ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ర‌జ‌నీకాంత్ పాత్ర ఏమైనా ఉందా ? అన్న సందేహాలు కూడా వ‌స్తున్నాయి. ఏదేమైనా వ‌ర్మ ఈ సినిమాతో ఏం చెప్పాడు ?  ఎన్ని సంచ‌ల‌నాలు ఉంటాయో ?  ఈ నెల 12న తేలిపోనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English