వైసీపీలోకి అమిత్ షా ఆత్మీయుడు.. నేడే ముహూర్తం

వైసీపీలోకి అమిత్ షా ఆత్మీయుడు.. నేడే ముహూర్తం

పెద్దపెద్ద కలలు కంటున్నా ఏమాత్రం పుంజుకోలేకపోతున్నా ఏపీ బీజేపీకి ఊహించని షాక్ తగులుతోంది. అమిత్ షాకు సన్నిహితుడిగా పేరున్న మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు బీజేపీని వీడి వైసీపీలో చేరనున్నారు.  గోకరాజు గంగరాజు, ఆయన తనయుడు రంగరాజు, గోకరాజు సోదరులు నరసింహరాజు, రామరాజు ఈ రోజు సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు.

2014 ఎన్నికల్లో గోకరాజు గంగరాజు బీజేపీ తరఫున నర్సాపురం ఎంపీ గెలిచారు. ఆయనకు బీజేపీ అగ్రనేతలతో పాటు రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. అలాగే ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీతోనూ సన్నిహితంగా ఉండేవారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. అమిత్ షా ఎప్పుడు ఏపీ పర్యటనకు వచ్చినా కృష్ణా కరకట్టపై ఉన్న గోకరాజు అతిథి గృహంలోనే దిగేవారు.

ఇప్పటి వరకు టీడీపీ నేతలు, వైసీపీ నేతలు తమతో టచ్‌లో ఉన్నారంటూ లీకులు వదులుతున్న బీజేపీకి గోకరాజు వ్యవహారంతో గొంతులో వెలక్కాయ పడ్డట్టైంది. బీజేపీలో చేరేందుకు నేతలు క్యూ కడతారని చెబుతున్న తరుణంలో తాజా సంఘటన కమలనాథులకు షాకిస్తోంది.

మరోవైపు వైసీపీనేత, నర్సాపురం ప్రస్తుత ఎంపీ రఘురామకృష్ణంరాజు బీజేపీతో బాగా టచ్‌లో ఉంటుండడంతో వైసీపీ నేతలు పట్టుబట్టి గోకరాజు గంగరాజును ఇప్పుడు వైసీపీలోకి తెస్తున్నారని వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English