జనసైనికులపై పవన్ బరస్ట్...

జనసైనికులపై పవన్ బరస్ట్...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరస్ట్ అయితే... అది కూడా తన సొంత పార్టీ rnకేడర్ పైనే, తానంటే పడిచచ్చే అభిమానులపైనే పవన్ బరస్ట్ అయితే ఎలా ఉంటుందో rnచూశారా? ఇప్పటిదాకా అయితే చూడలేదు గానీ... ఆదివారం తూర్పుగోదావరి జిల్లా rnమండపేటలో జరిగిన కార్యక్రమంలో ఆ ముచ్చటా తీరిపోయింది. పవన్ అంటే పిచ్చి rnఅభిమానం చూపే జనసైనికులు పెద్ద ఎత్తున పవన్ సమావేశానికి వచ్చారు. కేరింతలు,rn జేజేలతో హోరెత్తించారు. అయితే పవన్ వచ్చింది రైతుల సమస్యలు rnతెలుసుకోవడానికి కదా. రైతులతో మాట్లాడుతున్న పవన్... తన అభిమానులు కేకలు rnపెడుతుంటే.. నిజంగానే చిర్రెత్తిపోయింది. అంతే ఒక్కసారిగా బరస్ట్ rnఅయిపోయారు. కేకలు వేస్తున్న జనసైనికులపై ఓ రేంజిలో మండిపడ్డారు.

ఈ rnసందర్భంగా పవన్ జనసైనికులపై ఏ రేంజిలో ఫైరయ్యారన్న విషయానికి వస్తే... rn'అన్నం పెట్టే రైతు తన కష్టాలను చెబుతున్నప్పుడు మీరు అరుస్తుంటే నాకు ఎలా rnవినిపిస్తుంది? నిజంగా ఇబ్బందిగా ఉంది. క్రమశిక్షణ లేకపోతే మీరేం చేయలేరు. rnమీరు సరిగా లేకపోవడం వల్లే నేను ఓడిపోవాల్సి వచ్చింది. అది మరిచిపోకండి. rnక్రమశిక్షణ ఉండి ఉంటే జనసేన గెలిచి ఉండేది' అని పవన్ ఓ రేంజిలో జనసైనికులపైrn విరుచుకుపడ్డారు. ఇకనైనా క్రమశిక్షణతో మెలగుదాం అంటూ కూడా ఆయన తన పార్టీ rnకేడర్ పై కాస్తంత ఘాటు వ్యాఖ్యలే చేశారు.

మొత్తంగా తనను చూసి తన rnకేడర్ రంకెలు వేయడం పవన్ కు ఎందుకో ఈ దఫా నచ్చలేదనే చెప్పాలి. ఎప్పుడు rnసభలు, సమావేశాలు పెట్టినా... కేడర్ కేకలేస్తుంటే తనదైన శైలి ఎక్స్ rnప్రెషన్స్ ఇచ్చే పవన్... ఈ సారి మాత్రం ఓ రేంజిలో బరస్ట్ అయిపోయారు. ఇలా rnకేకలు వేయడాన్ని క్రమశిక్షణారాహిత్యంగా అభివర్ణించిన పవన్... అలాంటి rnక్రమశిక్షణ లేని కారణంగానే ఓడిపోయామంటూ చెప్పారంటే... సదరు కేకలు పవన్ ను ఏrn రేంజిలో ఇబ్బంది పెట్టాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి పవన్ rnబరస్ట్ తో అయినా జనసైనికుల్లో మార్పు వస్తుందో, లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English