కేసీఆర్‌ను నిలదీశాడు.. ఆ సీఎం గురించి మాట్లాడడేం?

కేసీఆర్‌ను నిలదీశాడు.. ఆ సీఎం గురించి మాట్లాడడేం?

ఇండియన్ న్యూస్ ప్రెజెంటర్లలో తనకున్నంత జాతీయ భావాలు ఇంకెవరికీ లేవన్నట్లుగా వ్యవహరిస్తుంటాడు అర్నాబ్ గోస్వామి. బర్నింగ్ ఇష్యూల మీద స్టూడియోలో ఆవేశంతో ఊగిపోతూ.. పెద్ద పెద్ద నాయకులు.. ఎంపీలు, మంత్రుల్ని సైతం నిలదీయడం.. ప్రశ్నలు సంధించడం.. జవాబుల కోసం డిమాండ్ చేయడం ద్వారా హీరో అయిపోతుంటాడు అర్నాబ్.

ఐతే కొన్ని అంశాల్లో మాత్రం సెలెక్టివ్‌గా మౌనం వహించడం ద్వారా అదే స్థాయిలో అన్ పాపులర్ కూడా అవుతుంటాడు అర్నాబ్. ‘ఇండియా టీవీ’ నుంచి వచ్చేశాక ‘రిపబ్లిక్’ పేరుతో సొంతంగా ఛానెల్ పెట్టి మరింతగా దూకుడుగా వ్యవహరిస్తున్నాడు అర్నాబ్.

ఐతే ఈ ఛానెల్ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అనుకూలం అన్నది బహిరంగ రహస్యం. వేరే పార్టీల నాయకుల్ని దునుమాడే అర్నాబ్.. భాజపా వాళ్లు ఏదైనా ఇష్యూలో ఇరుక్కుంటే మాత్రం నోరు మెదపడు. ఆ అంశం మీద చర్చ పెట్టడు.

ఇటీవల హైదరాబాద్‌లో దిశ ఉదంతం జరిగినపుడు దేశవ్యాప్తంగా ఎంత రగడ జరిగిందో తెలిసిందే. పార్లమెంటును కూడా ఈ కేసు ఊపేసింది. అప్పుడు అర్నాబ్ కూడా దీని మీద చర్చ పెట్టాడు. ఓ టీఆర్ఎస్ ఎంపీ లైన్లోకి వస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. మీ సీఎం కేసీఆర్ ఎక్కడ.. ఆయన నోరు మెదపడా.. దీని మీద ఒక ఖండన కూడా ఇవ్వడా అంటూ రెచ్చిపోయి మాట్లాడాడు. అబ్బా అర్నాబ్ సూపర్ అంటూ అందరూ అతణ్ని పొగిడేశారు. హీరోను చేశారు.

అది బాగానే ఉంది కానీ.. ఇప్పుడు దిశకు జరిగినట్లే ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఒక బాధితురాలికి అన్యాయం జరిగింది. తనపై గ్యాంగ్ రేప్ చేసిన నిందితుల మీద ధైర్యంగా కోర్టులో పోరాడుతున్న అమ్మాయిని.. దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో నిందితులు హై క్లాస్ వాళ్లు. వారికి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘోరం జరిగిన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది భాజపా ఎంపీ. అలాగే యూపీలో అధికారంలో ఉన్నది భాజపా. దిశ ఉదంతం లాగే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నావ్ బాధితురాలి ఘటన సంచలనం రేపుతుంటే అర్నాబ్ దీని మీద చర్చ పెట్టట్లేదు. మన కేసీఆర్‌ను నిలదీసినట్లు యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ను నిలదీయట్లేదు. అర్నాబ్ ద్వంద్వ నీతిని సోషల్ మీడియాలో నెటిజన్లు బాగానే ఎండగడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English