పవన్‌ మళ్లీ రాంగ్‌ స్టెప్‌ వేస్తున్నాడా?

పవన్‌ మళ్లీ రాంగ్‌ స్టెప్‌ వేస్తున్నాడా?

రాజకీయ పరంగా రాంగ్‌ స్టెప్స్‌ వేయడంలో మెగా బ్రదర్స్‌ని మించిన వాళ్లు వుండరేమో. ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు చిరంజీవి తప్పు మీద తప్పు చేసి మళ్లీ రాజకీయాల జోలికి వెళ్లలేని పరిస్థితి తెచ్చుకుని ఇప్పుడు బుద్ధిగా సినిమాలు చేసుకుంటున్నారు. జనసేన స్థాపించిన పవన్‌కళ్యాణ్‌ ఆది నుంచీ అన్నీ తప్పులే చేస్తూ వచ్చాడు. పార్టీ అనౌన్స్‌ చేసినపుడే పోటీలోకి దిగకుండా కేవలం మద్దతుదారునిగా వుండిపోయాడు.

ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా వుండి, ప్రతిపక్ష నేత జగన్‌కి అనుకూల పవనాలు వీస్తుండగా తాను పోటీలోకి దిగి తన వాణిని సరిగ్గా వినిపించలేక కనీసం తాను కూడా గెలవలేకపోయాడు. వచ్చే ఎన్నికల నాటికి అయినా జనసేన ఒక శక్తిగా ఎదుగుతుందని అభిమానులు ఆశిస్తూ వుంటే ఈసారి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే దిశగా పవన్‌ వెళుతున్నాడు. వరుసగా రెండు సార్లు కేంద్రంలో గెలిచిన భారతీయ జనతా పార్టీపై వచ్చే ఎన్నికలలో వ్యతిరేకత ఎక్కువే వుంటుంది.

సామాన్యులకి భారంగా మారిన పరిస్థితులు బిజెపికి ప్రతికూలమవుతాయి. అలాంటి పరిస్థితుల్లో పవన్‌ కనుక భాజపాతో కలిసి బరిలోకి దిగితే ఆ వ్యతిరేకత పవన్‌కీ సోకుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. స్పష్టమైన అవగాహన, నిర్ధిష్టమయిన కార్యాచరణ లేకుండా గాలివాటానికి రాజకీయం చేస్తోన్న పవన్‌కళ్యాణ్‌ ఇటు సినిమా కెరియర్‌ని కూడా పణంగా పెట్టేసి వచ్చిన అవకాశాలన్నీ కాలదన్నుకోవడం  అభిమానులని బాధిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English