జగన్‌కు ఎంత కష్టమొచ్చిందో?

జగన్‌కు ఎంత కష్టమొచ్చిందో?

ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన మరోసారి అబాసుపాలయింది. ఆయన వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసే నారాయణ హఠాన్మరణంతో జగన్ దిల్లీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే, రాజకీయ వర్గాల్లో దీనిపై మరో వెర్షన్ వినిపిస్తోంది. కేంద్రంలోని పెద్దల అపాయింటుమెంటు దొరక్కపోవడం.. ఈలోగా సహాయకుడి మరణం వల్లే ఆయన తిరిగొచ్చేశారని చెబుతున్నారు. కడప స్టీల్ ప్లాంటు ప్రారంభోత్సవానికి మోదీని పిలవడానికి జగన్ వెళ్లారని, కానీ, అపాయింటుమెంటు దొరకలేదన్నది మరో వాదన.

కాగా గతంలోనూ జగన్ అమిత్ షా అపాయింటుమెంటు కోసం గంటలుగంటలు వెయిట్ చేయాల్సి వచ్చిన సందర్భాన్ని రాజకీయవర్గాలు గుర్తు చేస్తున్నాయి. మోదీ, అమిత్ షాల అపాయింటుమెంట్లు సాధించలేకపోవడంపై తన పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిపై జగన్ మండిపడ్డారని కూడా గతంలో మీడియాలో కథనాలు వచ్చాయి.

తాజా ఇష్యూలో.. జగన్ అనంతపురంలో కియా ఫ్యాక్టరీ సెర్మనీలో పాల్గొన్న అనంతరం హఠాత్తుగా దిల్లీ బయలుదేరారు. షెడ్యూల్‌లో లేకున్నా ఆయన అప్పటికప్పుడు బయలుదేరారు. గురువారం సాయంత్రం దిల్లీ వెళ్లి అక్కడ పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. గురువారం రాత్రి ఆయన అమిత్ షాతో భేటీ అవుతారని వైసీపీ వర్గాలు చెప్పుకొచ్చాయి కానీ అపాయింటుమెంటు దొరకలేదు. శుక్రవారం మోదీని కలుస్తారని వైసీపీ వర్గాలు చెప్పాయి, అంతలో జగన్ సహాయకుడు మరణంతో వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు.

కొద్దిరోజుల కిందట జనసేనాని పవన్ దిల్లీ వెళ్లి రహస్యంగా బీజేపీ పెద్దలను కలిశారన్న ప్రచారం ఒకటుంది. ఆయన దిల్లీ వెళ్లి వచ్చాకే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ వైసీపీపై దూకుడు పెంచడంతో పాటు బీజేపీపై ప్రశంసలు కురిపించడమూ పెంచారు. దీంతో దిల్లీ కనుసన్నల్లో పవన్ రాజకీయాలు చేస్తున్నారని జగన్ అనుమానిస్తున్నట్లు సమాచారం.

కాగా జగన్‌కు అపాయింటుమెంటు దొరకనప్పటికీ ఆ పార్టీకే చెందిన ఎంపీ రఘురామకృష్ణం రాజుకు మాత్రం బీజేపీ పెద్దల అపాయింటుమెంట్లు సులభంగా దొరుకుతున్నాయని విమర్శకులు చెబుతున్నారు. అయితే, జగన్ మాత్రం ఆయన్ను దూరం పెడుతున్నారని.. విజయసాయిరెడ్డిపై ఆధారపడుతున్నారని.. విజయసాయి బీజేపీ పెద్దల అపాయింటుమెంటు సంపాదించలేక పోతున్నారని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English