కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే ఉగ్రరూపమే

కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే ఉగ్రరూపమే

అర్థమైనట్లే అనిపిస్తూ.. ఎంతకూ అర్థం కానట్లుగా కనిపించే కొద్ది మందిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గా చెబుతారు. ఆయన ఎత్తుగడలు ఊహకు అందని రీతిలో ఉంటాయంటారు.

ప్రతికూలతల్ని తనకు అనుకూలంగా మార్చుకోవటంలో ఆయన తర్వాతే ఎవరైనా అన్న అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంటుంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఇందుకు నిదర్శనంగా చెప్పాలి.

ఇదిలా ఉంటే.. మంత్రి తలసాని నోటి నుంచి వచ్చిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తన మనసులోని మాటల్ని దాచుకోకుండా మాట్లాడే నేతల్లో తలసాని ఒకరు. దిశ నిందితులపై జరిగిన ఎన్ కౌంటర్ పై ఆయన రియాక్ట్ అయ్యారు.

మహిళలపై దారుణాలకు పాల్పడే గుండాలు.. రౌడీలు తస్మాత్ జాగ్రత్త అన్న ఆయన అలాంటి వారికి దిశా నిందితులకు పడిన గతే పడతదన్న అర్థం వచ్చేలా మాట్లాడారు. గతంలో వికారుద్దీన్ గ్యాంగ్.. నయిం గ్యాంగ్ ఆగడాలకు తెలంగాణ పోలీసులు పుల్ స్టాప్ పెట్టారని.. తాజా ఉదంతంతో తెలంగాణ పోలీస్ అంటే ఏమిటో అందరికి తెలిసి వచ్చిందన్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే కేసీఆర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందన్న విషయాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించారు. దిశ ఘటనపై కేసీఆర్ మౌనంగా ఉన్నారంటూ పని కట్టుకొని విమర్శించిన వారి నోళ్లకు తాళం పడిందన్నారు. ముఖ్యమంత్రి శాంతంగా.. మౌనంగా ఉన్నారంటే.. ఉగ్రరూపం దాల్చుతారని.. అదెలా ఉంటుందో చాలామందికి తెలుసన్నారు.

దిశ కేసును బ్రహ్మాండంగా డీల్ చేశారన్న ప్రశంసలు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా.. కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే ఏదో జరుగుతున్నట్లే అన్న కొత్త విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చెప్పిన మంత్రి తలసానికి థ్యాంక్స్ చెప్పాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English