ఘోరం.. డ్యాన్స్ ఆపింద‌ని కాల్చేశారు

ఘోరం.. డ్యాన్స్ ఆపింద‌ని కాల్చేశారు

శుక్ర‌వారం ఉద‌యం దిశ హ‌త్య‌కేసు నిందితుల్ని హైద‌రాబాద్ పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేసి చంపేయ‌డం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఓ అమ్మాయికి జ‌రిగిన అన్యాయానికి స‌రైన రీతిలో బ‌దులిచ్చారంటూ అంద‌రూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కానీ కొన్ని సంద‌ర్భాల్లో పోలీసులు క‌ఠిన వైఖ‌రితో మృగాళ్ల‌లో భ‌యం పుట్టిస్తున్న‌ప్ప‌టికీ.. అమ్మాయిల‌పై అఘాయిత్యాలేమీ ఆగ‌ట్లేదు.

ఈ ఎన్‌కౌంట‌ర్ చ‌ర్చ‌నీయాంశం అవుతున్న స‌మ‌యంలోనే మ‌రో అమ్మాయికి జ‌రిగిన ఘోరం సోష‌ల్ మీడియా ద్వారా వెలుగులోకి వ‌చ్చింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఓ ఊరిలో పెళ్లి వేడుక జ‌రుగుతుండ‌గా డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి.. మ‌ధ్య‌లో ఆపినందుకు తుపాకీతో కాల్చి ప‌డేశారు.

దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఇద్ద‌ర‌మ్మాయిలు డ్యాన్స్ చేస్తుండ‌గా.. మ‌ధ్య‌లో ఎందుకో ఇద్ద‌రూ నెమ్మ‌దించారు. ఓ అమ్మాయి డ్యాన్స్ ఆపింది. అంత‌లోనే తూటా దిగుతుంది.. తూటా దిగుతుంది అంటూ స్టేజ్ కింది నుంచి ఎవ‌రో అరుస్తున్న మాట‌లు వినిపించాయి. ఏదో త‌మాషాలా అనుకున్నారు కానీ.. కొన్ని క్ష‌ణాల్లోనే ఈ అమ్మాయి మీదికి తూటా దూసుకొచ్చింది. నేరుగా ముఖం మీదే తూటా త‌గ‌ల‌డంలో బాధితురాలు ముఖం ప‌ట్టుకుని కుప్ప‌కూలిపోయింది.

ఆ అమ్మాయి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని తేలింది. తీవ్ర గాయంతో చికిత్స పొందుతున్న ఆమె ఫొటో కూడా బ‌య‌టికి వ‌చ్చింది. ఉత్త‌రాదిన పంజాబ్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్ లాంటి రాష్ట్రాల్లో పెళ్ళిళ్ల‌కు అతిథులు తుపాకుల‌తో రావ‌డం మామూలే. పెళ్లి సంబ‌రాల్లో భాగంగా తుపాకుల‌తో గాల్లోకి కాల్పులు జ‌రుపుతారు. ఏవైనా గొడ‌వ‌లు జ‌రిగితే మ‌నుషుల‌పైకి ఆ తుపాకుల్ని ప్ర‌యోగిస్తారు. కొన్నేళ్ల కింద‌ట పంజాబ్‌లో ఒక చోట వేదిక‌పై డ్యాన్స్ చేస్తున్న ప్రెగ్నెంట్ లేడీని ఇలాగే కాల్చి చంపేశారు. ప్ర‌స్తుత ఘ‌ట‌న‌లో అమ్మాయి ప‌రిస్థితి ఏమ‌వుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English