నిందితుల శ‌వాల ప‌రిస్థితి దారుణం...ఎన్‌కౌంట‌ర్ అయిన‌ చోటే

నిందితుల శ‌వాల ప‌రిస్థితి దారుణం...ఎన్‌కౌంట‌ర్ అయిన‌ చోటే

దిశ హత్యకేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు పారిపోవ‌డం...నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయ‌డం తెలిసిందే. షాద్‌నగర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. గత నెల 27వ తేదీన వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం చేసిన నిందితులు హత్య చేసి చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి కింద శవాన్ని కిరోసిన్ పోలీస్ కాల్చిన చోటే.. అక్క‌డే పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు మృతి చెందారు. ఇప్పుడు వారి ప‌రిస్థితి ఎలా ఉంది? ఇంత‌కీ ఆ నిందితుల శవాలు ఎక్క‌డా? అంటూ స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

సీన్ రీకన్ స్ట్రక్షన్ సమయంలో దిశ నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు పారిపోయేందుకు ప్రయత్నించడం....పోలీసులు ఆయుధాలు లాక్కోవడంతో పాటు రాళ్లను విసురుతూ పొలాల మీదుగా పరిగెత్తేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపి వారిని హతమార్చారు. ప్ర‌స్తుతం ఆ న‌లుగురి మృతదేహాలు చెల్లాచెదరుగా కనిపిస్తున్నాయి. ఘ‌ట‌న జ‌రిగిన పొలాల మధ్య 30 మీటర్ల విస్తీర్ణంలో పడి ఉన్నాయి. ఈ ప్రాంతంలో చుట్టూ చెట్లు, పొదలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మృతదేహాలను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించనున్నారు.

కాగా, ఈ కేసును పగలు ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ప్రయత్నిస్తే నిందితుల్ని ప్రజలే కొట్టిచంపేస్తారని అనుమానంతో పోలీసులు అర్ధరాత్రి రీకనస్టక్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా పోలీసులు అర్ధరాత్రి నిందితుల్ని ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. సీన్ రీకనస్ట్రక్షన్ జరుగుతుండగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా నిందితులపై ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు అన‌ధికారికంగా పేర్కొంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English