ఒక్క దెబ్బకు కేసీఆర్‌పై వ్యతిరేకత మటాష్

ఒక్క దెబ్బకు కేసీఆర్‌పై వ్యతిరేకత మటాష్

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై కొద్దికాలంగా వ్యతిరేకత పెరుగుతూ వస్తోందన్నది కాదనలేని మాట. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన భారీ ఆధిక్యంతో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఆ తరువాత వివిధ అంశాల కారణంగా ఆయనపై వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. టీఆరెస్ ఎన్ని మాటలు చెప్పినప్పటికీ ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలోనూ కేసీఆర్ తీరు తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. మరోవైపు దిశ అత్యాచారం కేసులో హోం మంత్రి, సీఎం సరిగా స్పందించలేదన్న విమర్శలూ వెల్లువెత్తాయి. కేసీఆర్‌కు భయపడి తెలుగు మీడియా దీనిపై బలంగా మాట్లాడలేకపోయినా నేషనల్ మీడియాలో మాత్రం కేసీఆర్‌ను ఏకిపడేశారు.

అయితే, దిశపై అత్యాచారం జరిగిన పది రోజుల తరువాత నిందితులను ఈ రోజు పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే నిందితులను ఎన్‌కౌంటర్ చేశారంటూ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే కేసీఆర్ కూడా ప్రజలు కోరుకున్న న్యాయం అందించారంటూ ఆయన్ను కీర్తిస్తున్నారు.

సోషల్ మీడియాలో దిశ నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఎన్ కౌంటర్ ఏ పరిస్థితుల్లో, ఎలా జరిగినా, కేసీఆర్ నుంచి అందిన ఆదేశాల మేరకే నిందితులను పోలీసులు మట్టుబెట్టారని, తద్వారా ఓ స్పష్టమైన సంకేతాన్ని రేపిస్టులకు పంపించారని కామెంట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ ను పొగుడుతూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ కేసీఆర్ వంటి నేత, సజ్జన్నార్ వంటి పోలీసు అధికారి తప్పనిసరిగా ఉండాలని నెటిజన్లు అంటున్నారు. "కేసీఆర్ జయహో" అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

దీంతో కేసీఆర్ ఒక్కసారిగా మళ్లీ హీరో అయ్యారు. రాజకీయ, సామాజిక కారణాలతో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న కేసీఆర్ ఇప్పుడు మళ్లీ ప్రజలు.. ముఖ్యంగా మహిళల విశ్వాసాన్ని పొందారు. యూత్, మహిళల్లో కేసీఆర్ హీరో అయ్యారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English