మంత్రి ప‌ద‌వి పోవ‌ద్దంటే...కేటీఆర్‌ను మెచ్చుకోవాలి మ‌రి

మంత్రి ప‌ద‌వి పోవ‌ద్దంటే...కేటీఆర్‌ను మెచ్చుకోవాలి మ‌రి

ఓపెన్‌గా మాట్లాడ‌టం, వేదిక ఏదైనా న‌వ్వులు పూయించేలా ఆకట్టుకునే ప్ర‌సంగం చేయ‌డానికి టీఆర్ఎస్ నేత‌, రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి సుప‌రిచిత చిరునామా అని పేరున్న సంగ‌తి తెలిసిందే. పార్టీ కార్య‌క్ర‌మ‌మైనా, అధికారుల‌తో మీటింగ్ అయినా..ఆఖ‌రికి విద్యార్థుల‌తో స‌మావేశ‌మైన‌...మ‌ల్లారెడ్డి తాను చెప్పాల‌నుకున్న‌ది చెప్పేస్తారు. అలా తాజాగా మ‌ళ్లీ ఓ భారీ ప్ర‌సంగం చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పారిశ్రామిక రంగానికి ఐకాన్ అని అన్నారు. మంత్రిగా ఆయ‌న‌, వ్యాపార‌వేత్త‌గా తాను ఎలాంటి ప్ర‌ముఖుల‌మో మ‌ల్లారెడ్డి చెప్పుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ పారిశ్రామిక విధాన‌మైన టీఎస్ఐపాస్ ఆవిష్క‌రించి 5 సంవత్సరాలైన‌ సందర్భంగా హైద‌రాబాద్‌లో ప్ర‌భుత్వం ఓ సమావేశం ఏర్పాటు చేసింది. కార్మిక శాఖ మంత్రి హోదాలో దీనికి హాజ‌రైన మంత్రి మల్లారెడ్డి ఐదు సంవత్సరాలల్లో TS-ఐపాస్ సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే కేటీఆర్ పై ప్రశంసలు గుప్పించిన మల్లారెడ్డి..ఆయ‌న్ను ఆకాశానికి ఎత్తేశారు. మంత్రి కేటీఆర్ యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ అని ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలంటూ మంత్రి మల్లారెడ్డి కొనియాడారు. అందరం కలిసి పని చేసి దేశంలోనే తెలంగాణను నంబర్-1 స్థానానికి తేవాలన్నారు. మ‌ల్లారెడ్డి ప్ర‌సంగానికి కేటీఆర్ ముసిముసి న‌వ్వులు న‌వ్వారు.

ఇక ఇదే సంద‌ర్బంగా తన గురించి కూడా మంత్రి మ‌ల్లారెడ్డి చెప్పుకొచ్చారు. తాను చిన్నప్పుడు సైకిల్ మీద పాలు సరఫరా చేశానని..ఇప్పుడు మినిస్టర్ అయ్యానని తెలిపారు. పాల వ్యాపారంతో ప్రారంభమైన తన సక్సెస్ మల్లారెడ్డి విద్యా సంస్థల వరకు వచ్చానంటే అందుకు నిదర్శనం కష్టం అన్నారు. కష్టపడితే సాధించలేనిది ఏది లేదనడానికి తానే ఆదర్శం అని తెలిపారు.

తెలుగువారికి తెలివి ఎక్కువని యువత కసిగా లక్ష్యాలను చేరుకోవాలని మంత్రి మల్లారెడ్డి సూచించారు. అయితే, గ‌త కొంత‌కాలంగా మంత్రి ప‌ద‌వి పోయే నాయ‌కుల జాబితాలో మ‌ల్లారెడ్డి పేరు ఉంద‌నే ప్ర‌చారం సైతం జ‌రుగుతోంది. ఈ ముప్పున‌కు చెక్ పెట్టేందుకే ఆయ‌న ప్ర‌శంస‌లు కురిపించారా అంటూ ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English