చిరంజీవి వేచిన ఉదయం వచ్చేసిందా?

చిరంజీవి వేచిన ఉదయం వచ్చేసిందా?

'మీరే రాజకీయాల్లోకి వస్తేనా... సింపుల్‌గా సిఎం అయిపోతారు' అని చిరంజీవిని చాలా మంది ఉబ్బేసేవాళ్లు. ఆ మాటలని నమ్మేసి సినీ సన్యాసం తీసుకున్న చిరంజీవి రాజకీయాల్లో అయిదేళ్లలోనే అన్నీ చూసేసాడు. ఇక ఆ సిఎం కుర్చీలో కూర్చోవాలనే ముచ్చట కూడా తీరిపోతుందని బలంగా వినిపిస్తోంది. కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాజీనామా చేయడంతో ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పుడు ముఖ్యమంత్రి లేకుండా పోయారు.

రాష్ట్రపతి పాలన పెట్టాలా లేక ఎవరైనా నమ్మినబంటుని కూర్చోబెట్టాలా అని తర్జనభర్జనలు జరిగాయి. చిరంజీవిని ఆ కుర్చీలో కూర్చోపెట్టాలని డిసైడ్‌ అయ్యారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ కొందరు చిరంజీవి వీరాభిమానులు సంబరాలు కూడా మొదలు పెట్టేసారు. చిరంజీవి ఎన్నాళ్లగానో వేచిన ఆ ఉదయం రేపో, మాపో ఉదయించడం ఖాయమని అంటున్నారు. ఆ కుర్చీలో కూర్చున్నాక చాలా తలనొప్పులు, ఎన్నో ఆభాండాలు ఉంటాయి.. తప్పదు. కానీ చిరంజీవి కోరుకున్నది మాత్రం ఎలాగోలా తీరిపోతోందని అతని సన్నిహితులు, అభిమానులు సంబరపడాలి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English