తెలంగాణ ప్ర‌జ‌ల మైండ్ బ్లాంక్ చేసిన కేసీఆర్‌

తెలంగాణ ప్ర‌జ‌ల మైండ్ బ్లాంక్ చేసిన కేసీఆర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. దాదాపు 50,000 మంది కార్మికుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఆయ‌న రాష్ట్రంలోని దాదాపు 4 కోట్ల మందికి మాత్రం షాకిచ్చే వార్త చెప్పారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఆర్టీసీ స‌మ్మెలో ఏక‌కాలంలో ఇటు తీపిక‌బురు వినిపించి అటు షాకులు ఇచ్చారు కేసీఆర్‌.

యూనియన్లు, ప్రతిపక్షాల మాటలు విని మీ బతుకులు ఆగం చేసుకోవద్దని కార్మికులను కోరిన సీఎం కేసీఆర్ కార్మికులు శుక్రవారం విధుల్లో చేరాల‌ని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ సంద‌ర్భంగా వారికి తీపిక‌బురు వినిపిస్తూ...సామాన్యుల‌కు మాత్రం షాకిచ్చారు. ఆర్టీసీ చార్జీలు పెర‌గ‌నున్న‌ట్లు..కేసీఆర్ ప్ర‌క‌టించారు.

ఆర్టీసీ సమస్యకు ముగింపు తేవాలని కేబినెట్ నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీకి తక్షణ సాయం కింద రేపు ఉదయం లోపు రూ.100 కోట్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. పెట్టుబడిదారులకు ఆర్టీసీని ఇవ్వదల్చుకోలేదని, ఆర్టీసీలో ప్రైవేటు బ‌స్సుల అవ‌కాశం కార్మికుల‌కు ఇస్తామ‌న్నారు.

"తెలంగాణ బిడ్డగా కార్మికుల జీవితాలు కాపాడే బాధ్యత నాపై ఉంది. . సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటాం. చనిపోయిన వారి కుటుంబంలో ఒకరి ఉద్యోగం ఇచ్చి వారిని ఆదుకుంటాం.ఎవరిపైనా వ్యక్తిగతంగా తమకు కోపం లేదని సీఎం అన్నారు. ఆర్టీసీ సంస్థ బతకాలి. ఆర్టీసీ కార్మికులంతా మా బిడ్డలే. కార్మికులను యాజమాన్యం వేధించకుండా చూస్తాం. వారిని కాదని మేం ఏ నిర్ణయం తీసుకోం.వచ్చే వారంలోగా ప్రతి డిపో నుంచి ఇద్దరు కార్మికులను పిలిచి మాట్లాడుతా.యూనియన్లను సంప్రదించే ప్రసక్తే లేదు. ఇప్పటికైనా కార్మికులు నిజం తెలుసుకోవాలి." అని కేసీఆర్ కోరారు.

కాగా, ఆర్టీసీ మేలు కోసం కి.మీ 20పైసలు చొప్పున బస్సు చార్జీలు పెంచుతామని తెలిపారు. ఈ ప‌రిణామం తెలంగాణ ప్ర‌జ‌ల‌కు షాక్ వంటిద‌ని అంటున్నారు. కార్మికుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్రారంభ‌మై...ఇటు యూనియ‌న్లు అటు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌ధ్య పంతం అన్న‌ట్లుగా సాగిన స‌మ్మెతో ఇప్ప‌టికే ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. ర‌వాణ స‌దుపాయం లేక స‌మ‌స్య‌లు ఎదుర్కున్నారు. తాత్కాలిక డ్రైవ‌ర్ల కార‌ణంగా ప‌లువురు క‌న్నుమూశారు. ఇలాంటి త‌రుణంలో...అదే స‌మ్మె రూపంలో మ‌రో షాక్ అన్న‌ట్లుగా...చార్జీలు పెంచ‌డం షాకింగ్ అని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English