బీజేపీలో చేరిన బైరెడ్డి...ఇంకేం చేయ‌మంటారు మ‌రి?!

బీజేపీలో చేరిన బైరెడ్డి...ఇంకేం చేయ‌మంటారు మ‌రి?!

రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్‌పీఎస్‌)పేరుతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని మొద‌లు పెట్టి...స్వ‌ల్ప‌కాలంలోనే చాప చుట్టి ..కీల‌క పార్టీల‌న్నింటిలో త‌న ప్ర‌స్థానాన్ని కొన‌సాగించిన సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తాజాగా బీజేపీ గూటికి చేరారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో...త‌న కూతురుతో క‌లిసి పార్టీ కండువా క‌ప్పుకొన్నారు. బీజేపీ ఇప్ప‌టికిప్పుడు ఏపీలో బ‌లంగా లేకున్న‌ప్ప‌టికీ...రాజ‌కీయ భ‌విత‌వ్యం లేని నేప‌థ్యంలో...బైరెడ్డి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్తున్నారు.

తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగువెలిగిన అనంత‌రం పార్టీతో విబేధించి ఆర్‌పీఎస్‌ను ఏర్పాటు చేశారు. ఐదేళ్ల పాటు నడిపిన ఈ వేదిక‌ను న‌డిపిన రద్దు చేసిన బైరెడ్డి చూపు అధికార తెలుగుదేశం పార్టీపై ప‌డింది. చాప‌చుట్టేసిన బైరెడ్డి టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఆశ్ర‌యించి పున‌రావ‌సం పొంద‌డానికి సిద్ధ‌మయ్యారనే వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ఏమైందో ఏమో కానీ ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో కండువా క‌ప్పుకొన్నారు. అయితే, కొద్దికాల‌నికి బైరెడ్డి  ఆ పార్టీకి బైబై చెప్పేశారు. డీసీసీ పదవి విషయంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో బైరెడ్డికి విభేదాలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని స‌మాచారం. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరిన బైరెడ్డి ఏడాదికే సొంత దారి చూసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
 
2014 ఎన్నిక‌ల‌కు ముందు వివిధ కేసుల నేప‌థ్యంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి జైలు కు వెళ్లగా ఆయ‌న కుమార్తె రంగ ప్రవేశం చేసి.. తండ్రి త‌ర‌ఫున పోరాటం ప్రారంభించింది. ఆ ఎన్నిక‌ల్లో ఆమె స్వయంగా ఇండిపెండెంట్‌గా బ‌రిలో నిలిచిన‌ప్ప‌టికీ...ఓడిపోయింది. జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీతో విబేధించారు.

ఇటీవ‌లి ఎన్నిక‌ల‌కు ముందు తిరిగి టీడీపీకి స‌పోర్ట్ చేశారు. అయితే... ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవ‌డంతో ఇటీవ‌ల బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బీజేపీతో చెలిమికి సిద్దమయ్యారు. తాజాగా కార్య‌క‌ర్త‌ల స‌మావేశం ఏర్పాటు చేసి బీజేపీలో చేర‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఢిల్లీ చేరి గురువారం రాత్రి బీజేపీ జాతీయ అద్య‌క్షుడు జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో పార్టీ కండువా క‌ప్పుకొన్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English