కేసీఆర్ సంచ‌ల‌నం..ఆర్టీసీ స‌మ్మెకు అనూహ్య ముగింపు

కేసీఆర్ సంచ‌ల‌నం..ఆర్టీసీ స‌మ్మెకు అనూహ్య ముగింపు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పొలిటిక‌ల్ స్ట్రైక్ చేశారు. విప‌క్షాల‌కు, ఆర్టీసీ కార్మిక యూనియ‌న్ల‌కు షాకిస్తూ..ఆర్టీసీ స‌మ్మెకు ఊహించ‌ని ముగింపు ప‌లికారు. ఆర్టీసీ కార్మికులు రేపు ఉదయం విధుల్లో చేరండని పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులు కార్మికులు మా బిడ్డలు అని పేర్కొంటూ ఆర్టీసీకి తక్షణ సాయం కింద రేపు ఉదయంలోపు రూ.100 కోట్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. కార్మికుల‌కు డూప్లికేట్ మాటలు చెప్పమని త‌మ‌ను విశ్వ‌సించి విధుల్లోకి చేరాలని కేసీఆర్ తెలిపారు. అంతేకాకుండా త్వరలో ప్రతి ఆర్టీసీ డిపో నుండి ఐదుగురు కార్మికుల‌ను పిలిచి మాట్లాడుతాని, ప్రతి అంశంపై క్షుణ్ణంగా వివరిస్తాన‌ని తెలిపారు. కార్మికుల స‌మ‌స్య‌ల కోసం ప్ర‌త్యేకంగా సీనియర్ మంత్రిని నియ‌మించి ఇబ్బందులు ఉంటే వారితో చర్చించేందుకు వీలు క‌ల్పిస్తామ‌ని తెలిపారు.

అనాలోచిత సమ్మెకు ఆర్టీసీ కార్మికులే బాధ్యత వహించాలని  కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు కార్మికులు తప్పుడు సంకేతాలిచ్చారని, అందుకే కార్మికుల్ని రోడ్డున పడ్డారని అన్నారు. ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాట నమ్మి లేనిపోని టెన్షన్లకు గురవుతున్నారని కేసీఆర్ చెప్పారు. యూనియన్లు, ప్రతిపక్షాల మాటలు విని బతుకులు ఆగం చేసుకోవద్దని కార్మికులను సీఎం కేసీఆర్‌ కోరారు. ``చెప్పుడు మాటలు విని ఆర్టీసీని నాశనం చేసుకున్నారు. అయినా సరే నేను చెప్పినట్లు చేస్తే ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చుకుందాం. అందుకే, ఆర్టీసీ కార్మికులు రేపు ఉదయం విధుల్లోకి చేరాలి. చేర్చుకోవ‌డం విష‌యంలో  ఎటువంటి షరతులు పెట్టడం లేదు. ఉద్యోగాల్లో హ్యాపీగా కొలువుల్లో చేరాలి` అని అన్నారు.

ఇంతేకాకుండా ఆర్టీసీకి లాభాల బాట ప‌ట్టే మార్గం గురించి కేసీఆర్ వివ‌రించారు. వచ్చే సోమవారం నుంచి ఆర్టీసీలో ఛార్జీల పెంపు ఉంటుందన్నారు. కిలోమీటరుకు 20 పైసలు పెంచేందుకు ఆర్టీసీకి ప్రభుత్వ అనుమతి ఇచ్చినట్లు సీఎం తెలిపారు. ఆర్టీసీ సంస్థకు అవసరమైతే రూ.100 కోట్లు ఇస్తామని ప్రకటించారు.సమ్మె కాలంలో చనిపోయిన ఆర్టీసీ కుటుంబంలోని ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.  సింగ‌రేణి వ‌లే బోన‌స్ ఇచ్చేలా తాను న‌డిపిస్తాన‌ని ప్ర‌క‌టించారు.
 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English