షాక్.. డాక్టర్ ప్రియాంకరెడ్డిని సజీవదహనం చేసిందెవరు?

   షాక్.. డాక్టర్ ప్రియాంకరెడ్డిని సజీవదహనం చేసిందెవరు?

దారుణం చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలోనూ.. చుట్టుపక్కల ప్రాంతాల్లో వరుస పెట్టి జరుగుతున్న దారుణాలకు పరాకాష్ఠగా ఈ ఉదంతాన్ని చెప్పాలి. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం చటాన్ పల్లిలో ఒక దుర్మార్గం బయటకు వచ్చింది. గుర్తు తెలియని యువతిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి తగలబెట్టారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఒక చానల్ లో టెలికాస్ట్ అవుతున్న వేళ.. ఆ యువతి తండ్రి ఆమె తన కుమార్తెగా అనుమానించి హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆయన అనుమానం నిజమైంది. మృతురాలు తన కుమార్తె అన్న విషయం తేలటంతో ఆ కుటుంబం మొత్తం భోరుమంటోంది. మృతురాలు వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి. ఆమె కుటుంబం శంషాబాద్ లో ఉంటోంది.  నవాజ్ పేట మండలం కొల్లూరులో ఆమె వెటర్నరీ వైద్యురాలిగా పని చేస్తున్నారు.

బుధవారం ఉదయం ఆసుపత్రికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరి వెళ్లింది. తన తండ్రికి బై చెప్పి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. నిన్న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో శంషాబాద్ కు తిరిగి వచ్చిన ఆమె తన సోదరికి ఫోన్ చేసింది. తన బైక్ పంక్చర్ అయ్యిందని.. తన చుట్టూ కొందరు లారీ డ్రైవర్లు ఉన్నారని చెప్పి ఫోన్ చేసి పెట్టేసింది. ఆ సమయంలో దగ్గర్లో ఉన్న టోల్ ప్లాజాకు వెళ్లాలని తాము చెప్పినట్లుగా ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఆమె కోసం వెళ్లి వెతకగా.. ఆమె ఆచూకీ లభించలేదు. ఈ ఉదయం 4.30 గంటల సమయంలో ప్రియాంకరెడ్డి డెడ్ బాడీని స్థానికులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా పుటేజ్ ను పరిశీలించారు. ప్రియాంకను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన అనంతరం హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.

హత్య అనంతరం ఆమె మీద పెట్రోల్ పోసి తగలపెట్టి ఉంటారని భావిస్తున్నారు. మొత్తం 15 టీంలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు. ఆమె బైక్ పంక్చర్ అయిన ప్రాంతంలో లారీ డ్రైవర్లు ఎక్కువగా సంచరిస్తారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. ఇంత దారుణానికి పాల్పడిన వైనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English