ఎమ్మెల్యేలకు మీరంటే భ‌యంలేదు... మేమంటే లెక్క‌లేదు..!

ఎమ్మెల్యేలకు మీరంటే భ‌యంలేదు... మేమంటే లెక్క‌లేదు..!

పొలిటిక‌ల్ క‌ర‌ప్ష‌న్‌తో పాటు ఇత‌ర అక్ర‌మాలు, అవినీతి కార్య‌క్ర‌మాల విష‌యంలో మీరంటే ఎమ్మెల్యేల‌కు భ‌యం లేద‌ని...మా ప‌రిస్థిత‌యితే మ‌రి దారుణంగా ఉంద‌ని.. వారి దృష్టిలో మేమంటే లెక్కేలేదు... మాకు ఏమాత్రం ఎమ్మెల్యేలు గౌర‌వం ఇవ్వ‌డం లేదంటూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మ‌క్షంలో ప‌లువురు మంత్రులు వాపోయార‌ట‌. ఇక కొంత‌మంది అధికారుల తీరు కూడా అదే విధంగా ఉంద‌ని చెప్పుకొచ్చార‌ట‌. ఇలా అయితే క‌ష్ట‌మ‌ని.. ప్ర‌భుత్వం దీనికి ఏదో రోజూ నింద‌లు ప‌డాల్సి వ‌స్తుంద‌ని ఫిర్యాదు చేశార‌ట‌.

ఇటీవ‌ల జ‌రిగిన కేబినేట్ మీటింగ్‌లో మ‌ద్యం, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లతో పాటు ప‌లు ముఖ్య‌మైన అంశాల‌పై మంత్రులు, జ‌గ‌న్ స‌మీక్షించార‌ని స‌మాచారం. మంత్రులు ప్ర‌స్తావించిన అంశాల‌పై జ‌గ‌న్ కూడా వివ‌ర‌ణ ఇచ్చార‌ని స‌మాచారం. ముందుగా ఎమ్మెల్యేలు ఆగ‌డాలు శ్రుతిమించి పోతున్నాయ‌ని మంత్రులు చేసిన వ్యాఖ్య‌ల‌కు..నాకు అంతా తెలుసున‌ని...ఎవ‌రేం చేస్తున్నారు..ఎక్క‌డ చేస్తున్నారు..త‌న‌కు ప్ర‌తీది రిపోర్టు ఉంద‌ని...స‌ద‌రు ఎమ్మెల్యేలు ప‌ద్ధ‌తి మార్చుకోకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని మంత్రుల స‌మ‌క్షంలో వ్యాఖ్య‌నించ‌డం గ‌మ‌నార్హం.

ఇక మంత్రుల‌పై కూడా కొంత‌మంది ఎమ్మెల్యేలు గ‌తంలో ఫిర్యాదు చేసిన ద‌రిమిలా ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేల‌పై ఫిర్యాదు చేయ‌డం ఇటు వైసీపీలో అటు మొత్తం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది. సొంత పార్టీలోనే విబేధాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న‌ అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

బార్ అండ్ రెస్టారెట్ల‌లో మ‌ద్యం ధ‌ర‌ల‌ను కొంచెం త‌గ్గించాల‌ని, ప‌ర్యాట‌క రంగంపై  ఇది ప్ర‌భావం చూపుతోంద‌ని మంత్రి అవంతి శ్రీనివాస్  చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌గా జ‌గ‌న్ అడ్డుకున్నారు. ప్ర‌దేశాల‌ను చూడట్టానికి వ‌చ్చి తాగుతూ కూర్చోర‌ని చెప్పార‌ట‌.

అయితే మీరంటే శ్రీరామ‌చంద్రులు ..మా లాంటి వారి గురించి ఆలోచించాలి  అన‌గా.. మీరు కూడా శ్రీరామ చంద్రులు కావాల‌ని కోరుకుంటూన‌ని చెప్ప‌డంతో అక్క‌డ న‌వ్వులు విర‌బూశాయ‌ట‌. మొత్తంగా మంత్రుల ఫిర్యాదుల‌ను జ‌గ‌న్ ప‌ట్టించుకున్న‌ట్టా... లేదా ? అన్న‌ది కూడా ఆస‌క్తిక‌రంగా మారింది. సీనియ‌ర్ ఎమ్మెల్యేలు కొంత‌మంది మంత్రుల‌ను ఏమాత్రం లెక్క చేయ‌క‌పోవ‌డంతో తెగ ఇబ్బంది పడిపోతున్నార‌ట‌.  చూడాలి ఈ ఫిర్యాదులు మున్ముందు ఇంకా ఏ స్థాయిలోకి పెరుగుతాయో..!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English