పవార్ ఫ్యామిలీ ఉచ్చులో బీజేపీ... గేమ్ అదిరిందిగా...!

పవార్ ఫ్యామిలీ ఉచ్చులో బీజేపీ... గేమ్ అదిరిందిగా...!

గత నెల రోజులుగా ట్విస్టుల మీద ట్విస్టులు... ఎప్పుడు ఏ క్షణానికి ఎవరు ? ఎటువైపు ఉంటారు.. రాజకీయం ఏ నిమిషాన ఎలాంటి మలుపులు తిరుగుతుందో ? తల పండిన మేధావులు సైతం ఊహించలేని పరిస్థితి. నెల రోజులుగా ఎన్నో తీవ్రమైన ఉత్కంఠ భరిత మలుపులతో దేశ రాజకీయాలను తనవైపు తిప్పుకున్న మహారాష్ట్ర రాజకీయం బుధవారం మరో మలుపు తిరిగింది.

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బలపరీక్షకు సమయం దగ్గర పడుతున్న టైంలో బిజెపికి బిగ్ షాక్ తగిలింది. ఈ రోజు ఉదయం సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ఐదు గంట‌ల‌లోగా బలపరీక్షలో బ‌లం నిరూపించుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసిన‌ వెంటనే మళ్లీ సరికొత్త ఆట మొదలైంది.

ముఖ్య‌మంత్రి ఫ‌డ్నీస్‌తో కలిసి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్సీపీ నేత, ఎమ్మెల్యే అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన కుమారుడు మాత్రం తన తండ్రి రాజీనామా చేయలేదని ప్రకటించడం విశేషం. మరోవైపు తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బిజెపి అధిష్టానం ఫ‌డ్న‌వీస్‌తో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించేందుకు రంగం సిద్ధం చేసింది. వాస్త‌వానికి అజిత్ ప‌వార్ అలా డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారో లేదో వెంట‌నే శివ‌సేన నుంచి ఆయ‌న‌కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ వెళ్లింది.

ఐదేళ్ల పాల‌న‌లో రెండున్న‌రేళ్లు ఎన్సీపీకి సీఎం పీఠం ఇస్తామ‌ని... ఆ రెండున్న‌రేళ్లు అజిత్ ప‌వార్ సీఎంగా ఉండ‌వ‌చ్చ‌ని సేన ఇచ్చిన బంప‌ర్ ఆఫ‌ర్‌తో రెండు రోజుల నుంచే ఆయ‌న టెంప్ట్ అవుతున్నార‌ని... మ‌ళ్లీ తిరిగి సొంత గూటికే వ‌స్తార‌న్న అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే ఇప్పుడు బీజేపీకి షాక్ ఇస్తూ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇక అజిత్ పవార్ మళ్లీ తన సొంత గూటికి చేరవచ్చునని తెలుస్తోంది. తాను ఎన్సీపీలోనే ఉన్నానని అజిత్ పవార్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.  

ఇక తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో అమిత్ షా, జేసీ న‌డ్డా ఢిల్లీలో స‌మావేశ‌మైన దేవేంద్ర ఫ‌డ్నవీస్‌తో ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. బుధ‌వారం సాయంత్రానికే ఫ‌డ్న‌వీస్ కూడా త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తారంటున్నారు. ఏదేమైనా మ‌హా మ‌లుపుల రాజ‌కీయంలో ప‌వార్ పాలిటిక్స్ ముందు బీజేపీ చేతులు ఎత్తేసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఈ మ‌లుపులు ఇక్క‌డితో ఆగుతాయా ?  లేదా కంటిన్యూ అవుతాయా ? అన్న‌ది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English