మరోసారి సుప్రీం ముందుకు వచ్చిన బాబు ఓటుకు నోటు కేసు

మరోసారి సుప్రీం ముందుకు వచ్చిన బాబు ఓటుకు నోటు కేసు

అత్యాశతో తిప్పలు తప్పవు. ఆ విషయం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎంత బాగా తెలిసినా.. అదే పనిగా తప్పుల మీద తప్పులు చేయటం అయనకు అలవాటే. రాజకీయాల్లో సిద్ధహస్తుడైన చంద్రబాబు తన పాత పద్దతుల్ని అమలు చేస్తూ అడ్డంగా బుక్ అయిన కేసుగా ఓటుకు నోటు కేసుగా పలువురు అభివర్ణిస్తారు.

ఈ అంశంపై విచారణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ ఇప్పటివరకూ లిస్ట్ కాలేదు. 2017లోనే పిటిషన్ దాఖలు చేసినా.. విచారణకు రాని నేపథ్యంలో ఈ పిటిషన్ ను త్వరగా విచారించాలని కోరుతూ ఆయన మరోసారి ఎర్లీ హియరింగ్ పిటిషన్ దాఖలు చేశారు.

ప్రస్తుతం ట్రయల్ కోర్టులో ఏ1 నుంచి ఏ5 వరకు మాత్రమే విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబును ఇంతవరకూ విచారించలేదేన్నారు. దీంతో ఓటుకు నోటు కేసు మరోసారి తెర మీదకు వచ్చినట్లైంది. తనపై ఓటుకు నోటు కేసు ఆరోపణలు వచ్చాక.. తన ఫోన్ ట్యాప్ అయినట్లుగా బాబు తెలంగాణ రాష్ట్ర సర్కారుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మరోసారి తెర మీదకు ఓటుకు నోటు కేసు వచ్చిన నేపథ్యంలో బాబు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English