కేసీఆరే గెలిచాడు...సమ్మె ఉప‌సంహ‌రించుకున్న ఆర్టీసీ కార్మికులు

కేసీఆరే గెలిచాడు...సమ్మె ఉప‌సంహ‌రించుకున్న ఆర్టీసీ కార్మికులు

తెలంగాణ‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఆర్టీసీ సమ్మె మొదలైన 52వ రోజున స‌మ్మెకు శుభం కార్డు ప‌డింది. సమ్మె భేషరతుగా విరమిస్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. మంగ‌ళ‌వారం ఉదయం 6 గంటల నుంచే కార్మికులంతా విధుల్లోకి హాజరుకావాలని కోరారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మె విరమిస్తున్నామని ప్రకటించిన‌ జేఏసీ నేతలు సమ్మె విరమిస్తున్నందున ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి, సమస్యలు పరిష్కారం అయ్యేందుకు కృషి చేయాల‌న్నారు. దీంతో...ఇప్పుడు అంద‌రి చూపు కేసీఆర్‌పై ప‌డింది. ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యం తీసుకోనున్నార‌నే ఆస‌క్తి నెల‌కొంది.

అక్టోబర్ 5 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లారు. 52 రోజుల పాటు సుధీర్ఘంగా సమ్మె సాగింది.తాజాగా నేడు రాష్ట్రవ్యాప్తంగా డిపోల‌ ముందు మహిళా కార్మికులు ఆందోళన చేపట్టారు. రెండు నెలలుగా జీతాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.బేషరుతుగా తమను విధుల్లోకి తీసుకోవాంటూ  నినాదాలు చేశారు.  డిపో ముందు బైటాయించిన మహిళ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. హైద‌రాబాద్ హ‌య‌త్‌న‌గ‌ర్ డిపోవ‌ద్ద చేప‌ట్టిన ఆందోళ‌న‌లో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్ కు తరలించగా... ఒకరికి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.

మ‌రోవైపు కీల‌క స‌మావేశం నిర్వ‌హించిన ఆర్టీసీ జేఏసీ సమ్మె భేషరతుగా విరమిస్తున్నట్లు ప్ర‌క‌టించింది. 52 రోజుల పాటు సమ్మె.. కార్మికుల నైతిక విజయమని జేఏసీ క‌న్వీన‌ర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. సమ్మెకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీని బతికించుకునేందుకే తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మంగ‌ళ‌వారం డిపోలకు వెళ్లి విధులు నిర్వహించేందుకు రెడీగా ఉండాల‌ని కార్మికుల‌ను కోరిన ఆయ‌న తాత్కాలిక కార్మికులు విధులకు రావద్దన్నారు. లేబర్ కోర్డులో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తంచేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English