టీడీపీలో అనుమాన‌పు రాజ‌కీయం...!

టీడీపీలో అనుమాన‌పు రాజ‌కీయం...!

తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న దేవినేని అవినాష్ పార్టీకి రాజీనామా చేయడం వైసీపీలో చేర‌డం...జగన్ అవినాష్‌కు ఆ వెంట‌నే వైసీపీ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ప‌గ్గాలు ఇవ్వ‌డం అన్ని రోజుల వ్యవధిలో జరిగిపోయాయి. ఇక చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినా ఫలితం కనపడకపోవడం, జగన్ వెళ్ళిన వెంటనే కోరిన సీటుకి పంపించడంతో దేవినేని అవినాష్ మంచి ఖుషిగా ఉన్నారు. నియోజకవర్గ బాధ్యతలను అప్పుడే భుజాన వేసుకుని పార్టీ కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో అధికారుల బ‌దిలీలు అన్ని అవినాష్ కంట్ర‌ల్లోకి వ‌చ్చేశాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఎక్కువ స్థానాలు గెలవాలి అనే టార్గెట్ జగన్ విధించడంతో అవినాష్ ఎక్కువగా కష్టపడుతున్నారు. ఇక్కడే తెలుగుదేశం పార్టీని ఆయన ఇబ్బంది పెడుతున్నారు. నియోజకవర్గంలో తమ కుటుంబానికి ఉన్న పాత పరిచయాలతో దేవినేని అవినాష్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అటు టీడీపీ నుంచి కొంద‌రు కీల‌క నాయ‌కులు కూడా ఇప్పుడు వైసీపీలోకి వ‌చ్చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లో కలవరం మొదలయింది.

తనతో సన్నిహితంగా ఉండే కొందరిపై అయన నిఘా పెట్టారని.. ఇక్క‌డ స‌మాచారం ఎవరెవ‌రు ? అక్క‌డ‌కు జార‌వేస్తున్నారు... ఎవ‌రు అవినాష్ కి సహకరిస్తున్నారు ? ఎవరు వైసీపిలోకి వెళ్ళే అవకాశం ఉందనే అంశంపై చ‌ర్చిస్తున్నార‌ట‌. గద్దె వర్గం కొందరిని అనుమానంగా చూడటం మొదలుపెట్టింది అనే సమాచారం కొందరు సీనియర్ స్థానిక నాయకులకు లీక్ అయ్యింది.

తాము ఏం చేసినా సరే తమను గమనిస్తున్నార‌నే భావనలో ఉన్న కొందరు సీనియర్లు గ‌ద్దె తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనుమానం ఉంటే తమను అడగాలి గాని ఈ విధంగా నిఘా పెట్టడం ఏంటి అంటూ ? మండిపడుతున్నార‌ట‌. రాజకీయంలో ఇలాంటివి ఉంటే మొహం మీద చెప్పాలి గాని నిఘాలు పెడితే తాము స్వేచ్చగా పని చేయలేమని తేల్చి చెప్పేస్తున్నారట నేతలు. కొంద‌రు సీనియ‌ర్లు ఈ విషయాన్ని అధినేత వద్దకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English