పవన్ ట్వీట్లు డెలీట్.. దేనికి సంకేతం?

పవన్ ట్వీట్లు డెలీట్.. దేనికి సంకేతం?

జనసేనాని పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. తన ట్విట్టర్ అకౌంట్‌ను పవన్ రాజకీయ అవసరాలకే ఉపయోగిస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ వేదిక నుంచే ప్రజా సమస్యల మీద స్పందిస్తాడు. తన రాజకీయ భావజాలాన్ని వినిపిస్తాడు. ప్రత్యర్థుల మీద విమర్శలూ చేస్తాడు.

ఐతే ఉన్నట్లుండి పవన్ ఈ ఏడాది మార్చి-ఆగస్టు మధ్య చేసిన పొలిటికల్ ట్వీట్లను డెలీట్ చేయడంపై రచ్చ నడుస్తోంది. సరిగ్గా చెప్పాలంటే మార్చి 19 నుంచి ఆగస్టు 21 వరకు పవన్ చేసిన పొలిటికల్ ట్వీట్లన్నీ ఎగిరిపోయాయంటున్నారు. ఇది ఒక పెద్ద పరిణామానికి సూచికగా పేర్కొంటున్నారు. ఇటీవలి పవన్ ఢిల్లీ పర్యటనతో దీన్ని ముడిపెడుతున్నారు.

కేంద్రం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పవన్ సత్సంబంధాలు నెరుపుతున్నారని.. ఆ పార్టీతో జనసేన కలిసి పని చేసే అవకాశముందని.. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సందర్భంగా భాజపాను టార్గెట్ చేసిన ట్వీట్లను పవన్ తొలగించాడని అంటున్నారు. జనసేనను భాజపాలో విలీనం చేయొచ్చిన కూడా ఒక ప్రచారం నడుస్తోంది కానీ.. అలా చేస్తే ఏ స్థాయిలో విమర్శలు వస్తాయో.. తన క్రెడిబిలిటీ ఎంతగా దెబ్బ తింటుందో పవన్‌కు తెలుసు కాబట్టి ఆ పని అస్సలు చేయకపోవచ్చు. ఇప్పుడే భాజపాతో అధికారికంగా పొత్తు పెట్టుకుంటాడా అన్నదీ సందేహమే.

ఐతే ఇప్పుడు బలంగా ఉన్న జగన్ సర్కారును ఎదుర్కోవడానికి పవన్‌కు మోడీ అండ్ కో మద్దతు చాలా అవసరం. భాజపా కూడా ఏపీలో బలపడటానికి ఇది సరైన సమయంగా భావిస్తోంది. తమ పార్టీలో బలమైన నాయకులు లేని నేపథ్యంలో పవన్‌తో కలిసి సాగడానికి ఆ పార్టీ కూడా సుముఖంగానే ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవలి పవన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ మేరకు ఒప్పందం కుదిరిందని.. ఈ నేపథ్యంలోనే పవన్ తన పాత ట్వీట్లు డెలీట్ చేసి.. భాజపాతో చేతులు కలపడానికి సిద్ధమయ్యాడని విశ్లేషకులు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English