ఆ నియోజకవర్గంలో టీడీపీ అడ్రెస్ గల్లంతేనా..!

ఆ నియోజకవర్గంలో టీడీపీ అడ్రెస్ గల్లంతేనా..!

గుడివాడ...పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఒక్క 1989 మినహా 1983 నుంచి 2009 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ జైత్రయాత్ర కొనసాగింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ టీడీపీకి తిరుగులేకుండా పోయింది.

ఎన్టీఆర్ సైతం పార్టీ పెట్టాక ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. కానీ ఎప్పుడైతే రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని వైసీపీలో వెళ్లారో అప్పటి నుంచి ఇక్కడ టీడీపీకి కష్టకాలం మొదలైంది. 2014, 2019 ఎన్నికల్లో నాని వైసీపీ తర‌పున వరుసగా గెలవడంతో, టీడీపీ అడ్రెస్ గల్లంతయ్యే పరిస్థితి వచ్చేసింది.

పార్టీ బలంతో పాటు, సొంత బలం కూడా తొడవ్వడంతో ఇక్కడ కొడాలి నానికి టీడీపీ చెక్ పెట్టలేకపోతుంది. 2014లో కొడాలి నాని మీద రావి వెంకటేశ్వరరావు లాంటి పట్టున్న నాయకుడుని నిలబెట్టిన పార్టీ ఓటమి పాలైంది. అయితే 2019 ఎన్నికలకు వచ్చేసరికి బాబు సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చి...విజయవాడలో పట్టున్న దేవినేని అవినాష్ ని రంగంలోకి దించారు. అయినా సరే కొడాలిని నిలువరించలేకపోయారు.

తాజాగా అవినాష్ కూడా టీడీపీకి షాక్ ఇచ్చిన వైసీపీ వైపు వెళ్లిపోవడంతో గుడివాడలో టీడీపీని నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. 2014లో పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావు ఉన్న ఆయన ఎంతవరకు నానికి పోటీ ఇస్తారో చెప్పలేం. అయితే మొన్న ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఆయన ఇన్‌చార్జ్ పదవి ఇస్తే తీసుకుంటారా? అంటే చెప్పలేం. అటు సీనియర్ నేత పిన్నమనేని వెంకటేశ్వరరావు ఉన్న ఆయన అంత యాక్టివ్ గా ఉండటం లేదు. ఇక గుడివాడ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ పిన్నమనేని బాబ్జీ వైసీపీలోకి వెళ్ళే అవకాశముంది.

అటు మాజీ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఉన్న...ఆయనకు నియోజకవర్గంపై పెద్ద పట్టు లేదు. ఆయ‌న బ‌లం అంతా గుడివాడ సిటీకే ప‌రిమితం. అస‌లు ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇక్క‌డ టీడీపీకి స‌రైన నాయ‌కుడే లేని ప‌రిస్థితి. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే కంచుకోటలో టీడీపీ పట్టు కోల్పోతున్నట్లే కనిపిస్తోంది. మరి పట్టు నిలుపుకోవడానికి అధినేత చంద్రబాబు ఎలాంటి నాయకత్వానికి బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English