ట్విట్టర్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ టాపిక్ ఇదే..

ట్విట్టర్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ టాపిక్ ఇదే..

శనివారం ఉదయం జనాల ముందున్న ఏ పేపర్ చూసినా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాకరే అనే వార్తే కనిపించింది. ఈ విషయం ఖరారైపోయిందని.. ఈ రోజు ఉదయం ఉద్దవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంఛనమే అని అన్ని పత్రికలూ పేర్కొన్నాయి.

కానీ ఓవైపు జనాలు పత్రికలు చదువుతుంటే.. టీవీల్లో దీనికి భిన్నమైన దృశ్యాలు దర్శనమిచ్చాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం జరిగిపోయింది. ఇదేం ట్విస్టురా అని జనాలు తలలు పట్టుకున్నారు. దటీజ్ బీజేపీ.. దటీజ్ అమిత్ షా అంటూ సామాజిక మాధ్యమాల్లో పంచులు మొదలయ్యాయి. ఇక అక్కడి నుంచి మొదలైంది తమాషా.

ఈ రోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మహారాష్ట్ర రాజ‌కీయ‌మే హాట్ టాపిక్. దాని మీద ఎన్ని జోకులు పేలాయో.. ఎన్ని మీమ్స్ వ‌చ్చాయో.. ఎన్ని పంచులు ప‌డ్డాయో లెక్కే లేదు. ఒక ఐస్ క్రీమ్ షాపు అత‌ను పిల్లాడికి ఐస్ క్రీమ్ ఇచ్చిన‌ట్లే ఇచ్చి ప‌దే ప‌దే బోల్తా కొట్టించే వీడియో ఒక‌టి వాట్సాపుల్లో.. సోష‌ల్ మీడియాలో స‌ర్కులేట్ అవుతుంటే చూసే ఉంటారు. షాపు వ్య‌క్తికి శ‌ర‌ద్ ప‌వార్ ముఖం పెట్టి.. ఐస్ క్రీమ్ అందుకునే పిల్లాడిగా ఉద్ద‌వ్‌ను పెట్టి అధికారం ఇచ్చిన‌ట్లే ఇచ్చి ఏమారుస్తున్న‌ట్లుగా ఉన్న‌ ఒక వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఇక ఈ రోజు జ‌రిగిన అతి సాధార‌ణ విష‌యాలు అంటూ.. కోహ్లి సెంచ‌రీ, మ‌హారాష్ట్ర‌లో అమిత్ షా సౌజ‌న్యంతో భాజ‌పా ప్ర‌భుత్వ ఏర్పాటు అని ఒక జోక్ పేల్చారు. ఈ త‌ర‌హా ట్రోల్ వీడియోలు, జోకులు, ఫొటోలు మ‌రెన్నో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అమిత్ షాను కింగ్ మేక‌ర్‌గా చూపిస్తూ ఎన్నో మీమ్స్ వ‌చ్చాయి. ఒక‌ప్పుడు ఇదే త‌ర‌హాలో కాంగ్రెస్‌కు జ‌ల‌క్ ఇచ్చిన శ‌ర‌ద్‌కు ఇప్పుడు అజిత్ ప‌వార్ షాకిచ్చాడంటూ జోకులు పేలుస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English