ఏ టీడీపీ ఎంపీ ఎవరి టీంలో ఉన్నారో తెలుసా?

ఏ టీడీపీ ఎంపీ ఎవరి టీంలో ఉన్నారో తెలుసా?

కేంద్రంతో విభేదించి చంద్రబాబు ఎన్డీయే నుంచి వచ్చేసి చాలాకాలమే అయినా.. పార్లమెంటులో టీడీపీకి గుప్పెడు మంది ఎంపీలే ఉన్నా పాలక బీజేపీ మాత్రం టీడీపీ ఎంపీలకు మంచి ప్రాధాన్యం ఇస్తుండడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని, అనుమానాలకు కలిగిస్తోంది. కేంద్రంలోని పెద్దలతో ఎంపీలకు ఉన్న వ్యక్తిగత రేపోతో పాటు వ్యాపార అవసరాల రీత్యా కేంద్రానికి సన్నిహితమవుతుండడం వంటి కారణాలతో వారికి పదవులు దక్కుతున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా పార్లమెంటు కమిటీలో టీడీపీ ఎంపీలకు ఎవరికి ఏ కమిటీల్లో స్థానమిచ్చారన్నదాన్ని బట్టి వారు ఎవరికి దగ్గర వంటి చర్చలు మొదలయ్యాయి.

విజయవాడ ఎంపీ కేశినేని నానిని. రోడ్డురవాణా, షిప్పింగ్‌ మంత్రిత్వశాఖ కన్సల్టేటివ్‌ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. నితిన్ గడ్కరీతో కేశినేని సన్నిహితంగా ఉండడం వల్లే ఆయనకు ఈ అవకాశం దక్కిందంటున్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ కేంద్ర హోంశాఖ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిటీలో టీడీపీ ఎంపీకి అవకాశం కల్పించడం ఎవరూ ఊహించనిది. టీడీపీ, బీజేపీల మధ్య రాజకీయంగా సత్సంబంధాలు ఇటీవలి కాలంలో అంతగా లేవు. అయినప్పటికీ లోక్‌సభ నుంచి కేశినేని నానికి, రాజ్యసభ నుంచి కనకమేడల రవీంద్రకుమార్‌కు మంచి అవకాశాలే దక్కాయి.

ఈ పరిణామాలన్నిటికీ టీడీపీ అధినేత చంద్రబాబు జాగ్రత్తగా గమినిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల తరువాత కేశినేని చంద్రబాబుపై నిరసన గళం వినిపించినా అవసరమైన సమయాల్లో చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నారు. ఇక కనకమేడల కూడా చంద్రబాబుకు లాయల్. వారు పార్టీని వీడే ప్రమాదం లేదు కానీ, వ్యక్తిగత, వ్యాపార అవసరాల రీత్యా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశాలున్నాయని వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English