జార్జిరెడ్డి వర్సెస్ రాజాసింగ్.. ఏం జరగబోతోంది?

జార్జిరెడ్డి వర్సెస్ రాజాసింగ్.. ఏం జరగబోతోంది?

తెలుగు రాష్ట్రాల్లో కొద్దికాలంగా పలు సినిమాలు రాజకీయంగా వివాదాస్పదమవుతున్నాయి. వైఎస్ జీవిత చరిత్రపై వచ్చిన యాత్ర.. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై వచ్చిన రెండు సినిమాలతో పాటు రాంగోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటివి వివాదాస్పదమయ్యాయి. వర్మ ప్రస్తుతం కమ్మరాజ్యంలో కడప రెడ్లు పేరుతో తీస్తున్న సినిమా చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు జార్జిరెడ్డి చిత్రంపైనా రాజకీయ వివాదాలు ముసురుకుంటున్నాయి.

విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘జార్జిరెడ్డి’. ఈ సినిమా ప్రచార చిత్రంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విరుచుకుపడ్డారు.  చిత్రం ప్రోమోలో ‘వన్ సైడ్’గా చూపించారని విమర్శించారు. సినిమా ముసుగులో ఏబీవీపీని కించపరిస్తే సహించమని, అడ్డుకుంటామని హెచ్చరించారు.

జార్జిరెడ్డి హత్య సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుందని, ఏబీవీపీకి చెందిన వ్యక్తులు ఈ హత్య చేశారన్నట్టుగా ఈ మూవీలో చూపిస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలు చూపించండి, అబద్ధాలు కనుక చూపిస్తే తమ నుంచి ‘హండ్రెడ్ పర్సంట్ రియాక్షన్ వుంటుంది’ అని హెచ్చరించారు. ఈ సినిమాలో కొన్ని షాట్లను కట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు, ఇలాంటి చిత్రాలకు సెన్సార్ బోర్డు ఎలా పర్మిషన్ ఇస్తోందో తనకు అర్థం కావడం లేదని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English