బిగ్ గాసిప్ : ఏపీ సీఎం మారతారా?

బిగ్ గాసిప్ : ఏపీ సీఎం మారతారా?

ఏపీ రాజకీయాలపై రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సిన సీఎం జగన్ గత రెండు వారాలుగా కోర్టుకు వెళ్లకపోవడం.. హాజరు నుంచి మినహాయింపు కోరినా లభించకపోవడంతో నవంబరు 22న ఆయన కోర్టుకు హాజరుకావాల్సిన పరిస్థితి. ఆ రోజు హాజరు కాకుంటే ఆయన బెయిలు రద్దయ్యే అవకాశమూ ఉంది. అదే జరిగితే ఆయన చిక్కుల్లో పడినట్లే.

మరోవైపు జగన్‌కు కేంద్రంలోని బీజేపీ పెద్దలకు మధ్య సయోధ్య కూడా తగ్గడం.. రాష్ట్ర బీజేపీ నేతల నుంచి జగన్‌పై బీజేపీ పెద్దలకు నిత్యం ఫిర్యాదులు అందుతుండడంతో కేంద్రం కూడా జగన్‌ను ఇరుకునపెట్టే యోచనలో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం... సీరియస్ కేసుల్లో బయటున్న నిందితుల బెయిల్స్ రద్దు కోసం కోర్టుల్లో పిటిషన్ వేయాలంటూ సీబీఐ, ఈడీలను కేంద్ర హోంశాఖ ఆదేశించిందంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు కనిపిస్తున్నాయి.

అయితే.. ఇవన్నీ విపక్ష టీడీపీ వర్గాలు చేస్తున్న దుష్ప్రచారమంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ నేతలే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని.. సోషల్ మీడియా వేదికగా వదంతులు వ్యాపింపజేస్తున్నారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.. జగన్ సీఎం పదవి పోవాలని సీనియర్లెవరూ చూడడం లేదని.. వైఎస్ భారతికి పాలన వ్యవహారాల్లో శిక్షణ ఇవ్వడం కూడా లేదని చెబుతున్నారు.

మరోవైపు టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా కూడా ఇలాంటి పోస్టే ఒకటి పెట్టారు. జగన్ బెయిల్ రద్దుకు సీబీఐ పావులు కదుపుతోందని, విజయసాయిరెడ్డి చేసిన విజ్ఞప్తిని కేంద్రం సున్నితంగా తిరస్కరించిందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో కోనీ సోషల్ మీడియాలో ఆ పోస్టుని ఆయన డిలీట్ చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English