నార్త్ ఇండియన్స్ జగన్‌ మీద పడిపోయారు!

నార్త్ ఇండియన్స్ జగన్‌ మీద పడిపోయారు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య తరచుగా నేషనల్ మీడియాలో వార్తల్లో వ్యక్తి అయిపోతున్నాడు. ఐతే ఈ విషయంలో ఆయన అభిమానులు పెద్దగా సంతోషించడానికేమీ లేదు. ఆయన నెగెటివ్ వార్తలతోనే చర్చనీయాంశంగా మారుతుండటమే ఇందుక్కారణం. పాలనలో అనేక తిరోగమన నిర్ణయాలతో రాష్ట్రాన్ని అథోగతి పాలు చేస్తున్నాడంటూ జగన్ మీద ఇటీవలే ఎకనామిక్ టైమ్స్ ఎడిటోరియల్ రాయడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దీన్ని పట్టుకునే పవన్ కళ్యాణ్ జగన్ మీద పెద్ద ఎత్తున ట్విట్టర్లో విమర్శలు చేశాడు. ఇంతకుముందు కూడా హిందూ సహా పలు జాతీయ పత్రికల్లో జగన్ పాలనను విమర్శిస్తూ ఎడిటోరియల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కారణంతో జగన్ ఢిల్లీకి టార్గెట్ అయ్యాడు. ఐతే ఈసారి జగన్‌ను లక్ష్యంగా చేసుకున్నది మీడియా వాళ్లు కాదు. సామాన్య జనాలే.

ఏపీలో జగన్ సర్కార్ వచ్చాక మత మార్పిడులు.. క్రిస్టియానిటీ వ్యాప్తి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. జనాల్ని క్రిస్టియానిటీ వైపు మళ్లించే ప్రయత్నాలు కూడా జోరుగా సాగుతున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో ఫొటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి. సహజంగానే భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు ఈ పరిణామాల్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. వ్యతిరేకిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం వెనుక కూడాా దురుద్దేశాలున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఏపీ పరిణామాలపై నార్త్ ఇండియన్స్.. భాజపా మద్దతుదారుల దృష్టిపడింది. నిన్న ఉదయం నుంచి #savehindusfromjaganreddy అనే హ్యాష్ ట్యాగ్ పెద్ద ఎత్తున ట్విట్టర్లో ట్రెండ్ అవుతుండటం గమనార్హం. అది ఏపీకి పరిమితం అయితే.. జనసేన, తెలుగుదేశం మద్దతుదారుల పని అనుకోవచ్చు. కానీ చెన్నై, బెంగళూరుల్లో మాత్రమే కాదు.. ఢిల్లీలో సైతం ఈ హ్యాష్ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అయింది. ఒక దశలో నేషనల్ ట్రెండ్స్‌లోనూ అగ్ర స్థానంలో ఈ హ్యాష్ ట్యాాగ్ కనిపించడం విశేషం. దీన్ని బట్టే నార్త్ ఇండియన్స్ జగన్‌ను ఎలా టార్గెట్ చేశారో అర్థం చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English