వార‌సులు వెన‌క్కి.. పాలిటిక్స్‌కి దూరం

వార‌సులు వెన‌క్కి.. పాలిటిక్స్‌కి దూరం

రాజ‌కీయాల్లో వార‌సులు కామ‌న్‌. గ‌త రాజ‌కీయాల‌కు, ప్ర‌స్తుత పాలిటిక్స్‌కు ఉన్న తేడా వార‌సులే! గ‌తంలో మాకు మేమే. మాకు రాజ‌కీయాలు వార‌స‌త్వం కాదు... అని చెప్పుకొన్న నాయ‌కులు ఉన్నారు. కానీ, నేడు అలా చెప్పుకోవ‌డాన్ని నామూషీగా భావిస్తు న్నారు. వార‌స‌త్వ రాజ‌కీయాల‌ను ఆస్తులుగా కూడా భావిస్తున్న ప‌రిస్థితి ఉంది. కుమారులు ఉన్న‌వారు ఏదో విధంగా వారిని లైన్ లో పెడుతుంటే.. కుమారులు లేని వారు కుమార్తెల‌నే రంగంలోకి దింపేస్తున్నారు. ఇక‌, వీరు ఇంట్ర‌స్ట్ చూప‌ని ప‌క్షంలో కోడ‌ళ్ల‌ను సైతం త‌మ వార‌సులుగా రంగంలోకి తీసుకువ‌చ్చిన నాయ‌కులు కూడా ఉన్నారు.

మొత్తంగా చూస్తే.. నాయ‌కుల వార‌స‌త్వ రాజ‌కీ యాల‌కు ఏపీలో ప్ర‌త్యేక స్థాన‌మే ఉంది. దివంగ‌త‌ ఎన్టీఆర్ హ‌యాం త‌ర్వాత నుంచి రాజ‌కీయంగా వార‌సులు రంగంలోకి దిగ‌డం తెలిసిందే. కోట్ల విజ‌య‌భాస్క‌ర‌రెడ్డి స‌హా వైఎస్ కుటుంబాలు కూడా రాజ‌కీయంగా కీల‌క పాత్ర పోషించాయి. అటు కాంగ్రెస్‌లోను, ఇటు టీడీపీ లోను కూడా వార‌స‌త్వ రాజ‌కీయాలు న‌డిచాయి, న‌డుస్తున్నాయి. అయితే, గ‌త వార‌సుల‌కు, ఇప్ప‌టికి కూడా చాలా తేడా క‌నిపిస్తోంది. గ‌తంలో వార‌సులు.. రాజ‌కీయంగా త‌మ ప్ర‌భంజ‌నాన్ని నిరూపించుకునేందుకు ప్ర‌య‌త్నించేవారు.

ప్ర‌జ‌ల్లో ఉండేవారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకునేవారు. కానీ, ఇప్పుడు మారిన ట్రెండ్‌లో వార‌సులు త‌మ రాజ‌కీయాల‌ను నేరుగా మొద‌లు పెట్టేస్తున్నారు. ప్ర‌జ‌ల‌తో కేవ‌లం ఓట్ల స‌మ‌యంలోనే ప‌ని అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మిగిలిన స‌మ‌యంలో మాత్రం త‌మ త‌మ బిజినెస్‌ల‌లో మునిగి తేలుతున్నారు. మ‌రికొంద‌రు.. సెటిల్ మెంట్ల‌లోనూ మునిగితేలుతున్నారు. దీంతో గ‌తంలో ఉన్న‌వారికి, ఇప్పుడు రంగంలో ఉన్న వారికి మ‌ధ్య చాలా తేడా క‌నిపించ‌డంతో పాటు.. ప్ర‌స్తుత జెన‌రేష‌న్‌లో భ‌విష్య‌త్తుపై బెంగ కూడా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చాలా మంది వార‌సులు టీడీపీలోను, ఇటు వైసీపీలో ను కూడా పోటీ చేశారు.

అయితే, వీరిలో వైసీపీ త‌ర‌పున బ‌రిలో నిలిచిన వారు విజ‌యం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన వారు మాత్రం ప‌డ‌కేశారు. దీంతో ఈ యువ నేత‌ల్లో నైరాశ్యం నెల‌కొంది. కొంద‌రు ఇప్ప‌టికే రాజ‌కీయాల‌కు దూరంగా జ‌ర‌గాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వీరిలో జేసీ అస్మిత్ రెడ్డి పేరు ప్ర‌ధానంగా వినిపిస్తోంది. ఇక‌, విజ‌య‌వాడ ప‌శ్చిమ నుంచి పోటీ చేసిన జ‌లీల్ కుమార్ ష‌బానా ఖ‌తూన్ ఇప్ప‌టికే అమెరికా వెళ్లి పోయారు. రాజ‌మండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన ముర‌ళీ మోహ‌న్ కోడ‌లు.. రూపాదేవి ఉండాలా? వ‌ద్దా? అనే ఊగిస‌లాట‌లో మునిగిపో యారు. అనంత‌పురం జిల్లాలో ప‌రిటాల వార‌సుడు ర‌వి కూడా అన్య‌మ‌న‌స్కంగానే కొన‌సాగుతున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో చూసుకుందాంలే! అనే ధోర‌ణిలో ఆయ‌న ఉన్న‌ట్టు స‌మాచారం.

క‌ర్నూలులో కేఈ కృష్ణ‌మూర్తి వార‌సుడు శ్యామ్ బాబు, శ్రీకాళ హ‌స్తిలో బొజ్జ‌ల కుమారుడు సుధీర్ వంటివారు కూడా రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. వీరంతా ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసి విజ‌యానికి దూర‌మైన వారే. దీంతో ఇప్పుడు వీరి ప‌రిస్థితి ఏంటి?  రాజ‌కీయంగా నిల‌దొక్క‌కుంటారా?  ప‌క్క‌కు త‌ప్పుకొంటారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. కొస‌మెరుపు ఏంటంటే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు వార‌సుడు మాజీ మంత్రి లోకేష్ ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యాక‌.. ఆయ‌న‌పై తీవ్ర‌మైన ఒత్తిళ్లు పెరి గిన విష‌యం తెలిసిందే.

ఇదే ప‌రిస్థితి ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనూ వార‌సులు త‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికిప్పుడు రాజ‌కీయాల్లో కొన‌సాగినా.. నాలుగేళ్ల‌పాటు ప్ర‌జ‌లకు చేరువగా ఉండాలంటే.. క‌ష్ట‌మ‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతుండ‌డం కూడా కార‌ణంగా క‌నిపిస్తోంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English