ఇదంతా అధ్వాని అండ్ కంపెనీ పనేనా?

ఇదంతా అధ్వాని అండ్ కంపెనీ పనేనా?

తెలంగాణ విషయంలో ఎన్నో ఏళ్లుగా ఒకటే స్టాండుపై ఉండి తెలంగాణలో బలం పుంజుకుంటున్న వేళ చివరినిముషంలో బిజేపి అంతా గందరగోళం సృష్టించి పార్టీని అక్కడ ఇక్కడా కూడా దెబ్బతినేలా చేసుకోవడం వెనుక అసలు కథేంటి? మోడిని దెబ్బతీసేందుకు ఆయన ప్రధాని అభ్యర్థిత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న అధ్వాని అండ్ కంపెనీ కావాలని చేసిన కుట్ర ఏదైనా దాగి ఉందా అన్న అనుమానాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. 

పరిస్థితులు అచ్చుగుద్దినట్టు అలాగే ఉండడం కూడా ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. తెలంగాణ ఏర్పాటు, దానికి మద్దతు అన్నది భాజపా కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు. తెలంగాణకు అనుకూలం అన్న పార్టీ నిర్ణయం గతంలో వాజపేయి, అద్వానీ హయాంలోనే తీసుకున్నారు. ఇది జరిగి ఎన్నో సంవత్సారాలు అయింది. ఈ లోగా కాంగ్రెస్ తెలంగాణ నిర్ణయం తీసుకుంది. అది తీసుకున్నప్పటినుంచి అధ్వాని, వెంకయ్యనాయుడు,సుష్మా స్వరాజ్ వంటి వారు ఇన్నేళ్లు సీమాంధ్ర విషయంలో ఒక్క మాట మాట్లాడలేదు. అలాంటింది చివరినిముషంలో  రకరకాలుగా మాట్లాడడం ప్రారంభించారు. సీమాంధ్రపై ప్రేమ వున్నట్లు నటించారు.

ఇలా మాట మారిస్తే తెలంగాణ విషయంలో వారికి ఉన్న మంచి పేరు పూర్తిగా గంగలో కలుస్తుందన్న విషయం అంత పెద్ద మనుషులకు తెలియదంటే ఎలా... సరే సీమాంధ్రలో బలం పుంజుకోవాలి కదా.. అందుకే చేసారు అనుకుందాం, కాని కాంగ్రెస్ విడగొడుతోంది అన్న వ్యతిరేకత తప్ప సీమాంద్రలో బిజేపిపై అంత వ్యతిరేకత లేదు. కారణం విభజన పాపం అంతా కాంగ్రెస్, లేఖ ఇచ్చిన టిడిపి, వైఎస్సార్ సిపి అంటూ సీమాంద్రలు వారిని నిందించారే తప్ప ఈ విషయంలో బిజేపిని తప్పు బట్టలేదు.

ఎప్పుడయితే వెంకయ్య, అధ్వాని వంటి వారు తెలంగాణ ముఖ్యమే కాని సీమాంద్ర సమస్యలు కూడా మాకు అంతే ప్రాధాన్యం అంటూ ప్రకటనలివ్వడం మొదలుపెట్టారో అప్పటి నుంచి సీమాంద్రలో బిజేపిపై ఫోకస్ పడింది. తెలంగాణకు  మద్దతివ్వద్దంటూ సీమాంద్రలో ఒత్తిడి మొదలయింది. కానీ వున్నట్లుండి ప్లేటుమార్చి, నేరుగా తెలంగాణవైపు వెళ్లిపోయారు. అస్సలు సీమాంధ్రను పట్టించుకోనట్లు ప్రవర్తించారు. ఇదంతా అద్వాని అండ్ కంపనీ నిర్వాకమే... అధికారంలోకి రావాల్సిన తరుణంలో ఎన్నికలకు ముందు బిజేపిని వారే ఎందుకు ఇరకాటంలోకి తీసుకువెళ్లారు, పైగా బిజేపికి ఇరకాటమే కాదు, ఇప్పుడు బిజేపిని ఇరుప్రాంతాల్లోను విలన్ గా చేసి కాంగ్రెస్ ను తెలంగాణలో హీరోను చేసారు. ఎందుకంటే బిజేపి అడ్డంకులు కల్పించినా కూడా తెగించి కాంగ్రెస్ సాదించింది అన్న పేరు వచ్చింది.

ఇదంతా ఏపి విషయంలో బిజేపిని టోటల్ గా లాస్ చేయడానికే అన్నది స్పష్టం,  అదే నిజం కూడా అయింది. దీనివెనుకు అద్వానీ అండ్ కో గేమ్ ప్లాన్ వుందని తెలుస్తోంది. ఎందుకంటే మోడి అంటే వారికిష్టం లేదు, ఆయనను అధికారానికి దూరం చేసే ఏ అవకాశాన్ని జారవిడుచుకోరు. అందుకే ఆ వర్గం ఈ కుట్రకు పాల్పడిందేమో అన్న అనుమానం కలగక మానదు. ఎందుకంటే 42 లోక్ సభ స్థానాలున్న ఏపిలో బిజేపికి  ఈ దెబ్బతో ఇక వచ్చేవి ఏమి ఉండవు. అంతా టిఆర్ఎస్,కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోతాయి.

టిడిపితో పొత్తుతో ఒకటో రెండో స్థానాలు సొంతంగా గెల్చకునే అవకాశం వుండేది. ఇప్పడు అదీ పోయింది.  బిజేపి సీమాంద్రుల ప్రయోజనాలను పట్టించుకోకుండా విడగొట్టింది అన్న పేరు వచ్చేసింది. ఇప్పుడు బిజేపికి సొంతంగా రావు, టిడిపి కూడా పొత్తు పెట్టుకోనని ప్రకటించింది. అంటే మోడినీ దెబ్బతీయడానికే చివరి క్షణంలో ఆయన వ్యతిరేక వర్గం పన్నిన కుట్రేనేమోనన్న భావం అందరిలో నెలకొంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English