అసద్ కు అసలు సిసలు ప్రత్యర్థి దొరికినట్టే

అసద్ కు అసలు సిసలు ప్రత్యర్థి దొరికినట్టే

మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యవహారం చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఎక్కడికెళ్లినా... ఏదో ఒక వివాదం రేకెత్తేలా వ్యవహరిస్తున్న అసద్... ఏళ్ల తరబడి వివాదంగా మారిపోయిన అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును వ్యతిరేకిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో ప్రతివాదులుగా ఉన్న ముస్లిం సంస్థలు... మతసామరస్యాన్ని కాపాడే ఉద్దేశంలో కోర్టు తీర్పును గౌరవిస్తుంటే... అసద్ మాత్రం సుప్రీం తీర్పు తమకు సమ్మతం కాదని తనదైన శైలి వాదనను వినిపించి సంచలనం రేకెత్తించారు. ఈ క్రమంలో అసద్ కు అసలు సిసలు ప్రత్యర్థిగా ఇప్పుడు కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ఎంట్రీ ఇచ్చేశారు.

దేశం మొత్తం ఓ దారిలో వెళుతుంటే... అసద్ ఒక్కరే భిన్న మార్గంలో వెళుతున్నారని బాబుల్ సుప్రియో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగానే సంచలనంగా మారిపోయాయి. అంతేకాకుండా అసద్ ను ఇస్లాం మత బోధకుడుగానే కాకుండా మత విధ్వేషాలు రెచ్చగొట్టే విషయంలో అందరి కంటే ఓ మెట్టు పైనే నిలిచిన జకీర్ నాయక్ తో బాబుల్ పోల్చారు. జకీర్‌ నాయక్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విద్వేషాన్ని వ్యాపింపచేయడం, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం వంటి పలు ఆరోపణలున్న విషయం తెలిసిందే. అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తనకు తమ మసీదును తిరిగి ఇవ్వాలని అసద్ పేర్కొన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

బాబుల్ చేసిన ఈ వ్యాఖ్యలు... అసద్ ను ఇరకాటంలో పడేశాయనే చెప్పక తప్పదు. జకీర్ నాయక్ ఏ మేర సంచలనాలు రేకెత్తించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇస్లామిక్ మత బోధనలు చేసేందుకు ఓ టీవీ ఛానెల్ ను ఏర్పాటు చేసుకున్న జకీర్... ఇస్లామిక్ యువతను ఉగ్రవాదం వైపు మళ్లేలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. దీంతో ఆయనపై కేసులు నమోదు కాగా... దేశం వదిలి పారిపోయారు. ఇలాంటి జకీర్ ను గుర్తు చేసిన బాబుల్... అసద్ కూడా జరీక్ లానే మారిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా జకీర్ ను మించిపోయేలా అసద్ వ్యవహరిస్తున్నారని కూడా బాబుల్ తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అసద్ కు బాబుల్ ఇప్పుడు అసలు సిసలు ప్రత్యర్థిగా మారిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English