టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ రోడ్డున ప‌డ్డ నాయ‌కులు సాధించేదేంటి..?

టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ రోడ్డున ప‌డ్డ నాయ‌కులు సాధించేదేంటి..?

రాష్ట్రంలో గ‌డిచిన రెండు రోజులుగా అధికార వైసీపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీల మ‌ధ్య జ‌రుగుతున్న మాట‌ల యుద్దంలో శ‌నివారం ర‌స‌వ‌త్త‌ర ఘ‌ట్టం.. టీవీ తెర‌ల‌పై ఆవిష్కృత‌మైంది. ఇటు వైసీపీ-అటు టీడీపీ నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు బుర‌ద జ‌ల్లుకున్నారు. గ‌తాలు త‌వ్వుకున్నారు. దూష‌ణ‌ల ప‌ర్వానికి తెర‌దీశారు. నువ్వు పోక‌చెక్కతో అంటే.. నేను త‌లుపుచెక్క‌తో అంటా! అంటూ నాయ‌కులు ఒక‌రిపై మ‌రికొరు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. స‌వాళ్లు రువ్వుకున్నారు. అరెయ్‌.. ఒరేయ్‌!! అంటూ విరుచుకుపడ్డారు. మొత్తానికి శ‌నివారం నాటి రాజ‌కీయ ప‌రిస్థితి అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది.

టీడీపీ ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేయ‌డం, వైసీపీ అధినేత జ‌గ‌న్ అడుగు జాడ‌ల్లో న‌డుస్తాన‌ని చెప్ప‌డంతో ప్రారంభ‌మైన ఈ రాజ‌కీయ కురుక్షే త్రం అనూహ్యంగా శ‌నివారం పీక్ పొజిష‌న్‌కు పెరిగిపోయింది. అదే స‌మ‌యంలో టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీపై వంశీ చేసిన వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు కూడా రాష్ట్రంలో కాక పుట్టించాయి. దీనిపై టీడీపీ నుంచి ప్ర‌తి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే, వీటిలో మ‌రింత వేగం పెంచుతూ.. మాజీ మంత్రి దేవినేని ఉమా రంగంలోకి దిగి.. మంత్రి కొడాలి నానిపై విమ‌ర్శ‌లు చేయ‌డంలో మొత్తం రాజ‌కీయ కాక ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసుకుని రంగంలోకి నాని దిగారు. ఈ ప‌రిణామంతో మ‌రింత తీవ్రంగా మాట‌ల యుద్ధం జ‌రిగింది.

టీడీపీ పుట్టుపూర్వోత్త‌రాలు స‌హా.. ప్ర‌స్తుత ప‌రిస్థితి వ‌ర‌కు వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి ఉతికి పారేశారు. ఇక‌, శ్రీకాకుళంలో మంత్రి ధ‌ర్మాన క్రిష్ణ‌దాస్ కూడా ఎన్న‌డూ లేని విధంగా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌డం చూస్తే.. విమ‌ర్శ‌కులు కూడా ఆశ్చ‌ర్య‌పోయిన సంఘ‌ట‌న క‌నిపించింది. ఏకంగా.. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు బ‌హిరంగ వేదిక‌ల‌ను, మీడియా మీటింగుల‌ను, లైవ్ ప్రోగ్రామ్స్‌ను ఎంపిక చేసుకోవ‌డం అనే భిన్న‌మైన వాతావ‌ర‌ణం నేటి రాజ‌కీయాల్లో క‌నిపిస్తోంది. దీనికి ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడా లేకుండా పోవ‌డం, సీనియ‌ర్ , జూనియ‌ర్ అనే భేదాలు కూడా మ‌రిచిపోవ‌డం ఇప్పుడు ఏపీలో రాజ‌కీయాలు ఏదిశ‌గా పోతున్నాయ‌నే ఆవేద‌న ప్ర‌జాస్వామ్య వాదుల నుంచి వినిపిస్తోంది.

టీడీపీ వ‌ర్సెస్ వైసీపీలో నాయ‌కులు రోడ్ల మీద‌కు వ‌చ్చి చేసుకున్న ర‌గ‌డ వ‌ల్ల కొన్ని గంట‌ల విలువైన మీడియా కాలం వృధాఅయిందే త‌ప్ప‌.. ప్ర‌జ‌ల‌కు ఏదైనా ఉప‌యోగం ఉందా ? అనే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. వ‌చ్చే త‌రానికి ఆద‌ర్శంగా మ‌న‌మే లేన‌ప్పుడు.. వారికి ఎలాంటి సంస్కృతిని నేర్పుతాం! అని ప్ర‌శ్నించిన గాంధీ వార‌సులుగా ఈ నేత‌లు ఈ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఏం సందేశం ఇవ్వ‌ద‌లిచారు. అంద‌రూ ఆ తాను ముక్క‌లే. అంద‌రివీ స్వార్థ రాజ‌కీయాలే. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి మిన‌హాయింపు లేద‌ని స్ప‌ష్టం చేస్తున్న నేటి రాజ‌కీయాల్లో ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకోవ‌డం వ‌ల్ల మ‌రింత ప‌లుచ‌న అవుతారే త‌ప్ప‌.. ప్ర‌యోజ‌నం ఉండ‌దు!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English