కేజీ ప్లాస్టిక్ తెస్తే కేజీ బియ్యం..

కేజీ ప్లాస్టిక్ తెస్తే కేజీ బియ్యం..

ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గంలో ప్లాస్టిక్ సమస్య లేకుండా చేయడానికి గాను కొత్త పథకం తీసుకొచ్చారు.  కిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తెచ్చి కిలో బియ్యం తీసుకు వెళ్లాలంటూ ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా రోజా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

నియోజకవర్గంలో ప్రతి మున్సిపాలిటీ, పంచాయతీ, వార్డు పరిశుభ్రంగా ఉండాలని, ఇందుకోసం ఎక్కడ ప్లాస్టిక్ కనిపించినా ఏరివేయాలని పిలుపునిచ్చారు. 'స్వచ్ఛ నగరి' నియోజకవర్గాన్ని సాధించి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం, అందరికీ ఆదర్శంగా నిలుద్దాం అని సూచించారు.

కాగా పెద్దాపురం, కాకినాడ వంటి చోట్ల పలు స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి విధానాన్ని అమలు చేస్తున్నాయి. కిలో ప్లాస్టిక్ తెస్తే కిలో బియ్యం ఇస్తూ ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రయత్నిస్తున్నాయి. అదే స్ఫూర్తితో రోజా కూడా తన నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చడానికి ఈ విధానాన్ని అమలు చేయడానికి నిర్ణయించారు. అయితే, ప్రజల్లో పర్యావరణ స్పృహ పెంచడానికి గాను ఈ పథకాన్ని కొద్దికాలం పాటు అమలు చేయనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English