టీడీపీలో ఏం జ‌రిగింది.... వంశీ ఫైరింగ్‌కు రీజ‌నేంటి..!

టీడీపీలో ఏం జ‌రిగింది.... వంశీ ఫైరింగ్‌కు రీజ‌నేంటి..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో చోటు చేసుకున్న సంచ‌ల‌నం ఇంకా ర‌గులుతూనే ఉంది. గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వంశీ పార్టీకి రిజైన్ చేశారు. అయితే, ఆది నుంచి అటు పార్టీకి, ఇటు చంద్ర‌బాబుకు కూడా అత్యంత విధేయుడిగా ఉన్న ఆయ‌న‌.. అనూహ్యంగా త‌న విమ‌ర్శ‌ల‌తో భోగి మంట‌లు మండించారు. ఈ సెగ‌లు ఇంకా ర‌గులుతూనే ఉన్నాయి. మ‌రి అత్యంత విధేయుడు, న‌మ్మ‌క‌స్తుడు, విన‌య‌శీలిగా పేరు తెచ్చుకున్న వంశీ ఒక్క‌సారిగా ఇలా నిప్పులు క‌క్క‌డానికి కార‌ణ‌మేంటి?  పైగా ఈ ఎన్నిక‌ల్లో పార్టీపై ఇంత వ్య‌తిరేక గాలిలోనూ అనూహ్య‌మైన విజ‌యంసొంతం చేసుకున్న వంశీ ఎందుకు ఇలా మారిపోయాడు? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

సాధార‌ణంగా గెలుపు ఓట‌ములు ఏ నాయ‌కుడిపైనైనా ప్ర‌భావం చూపిస్తాయి. అదే స‌మ‌యంలో పార్టీలు కూడా మారిపోతారు. కానీ, ఇలా వంశీ మాదిరిగా విరుచుకుప‌డిన నాయ‌కులు ఇటీవ‌ల కాలంలో చాలా చాలా అరుదుగానే క‌నిపిస్తున్నారు. ఇప్పుడు వంశీ ఈ జాబితాలో చేరిపోయారు. స‌రే! ఇంత‌కీ టీడీపీలో ఏం జ‌రిగింద‌నే చ‌ర్చ విష‌యానికి వ‌స్తే.. మితిమీరిన స్వామి భ‌క్తి పెరిగిపోయింద‌నేది వాస్త‌వం. ఈ క్ర‌మంలోనే కొంద‌రు తృతీయ శ్రేణి నాయ‌కులు భ‌జ‌న ప‌రులుగా మారిపోయారు. ఫ‌లితంగా అయిన దానికీ కానిదానికీ పొగ‌డ్త‌ల వ‌ర్షంతో పాటు... త‌మ ప‌నులు చేయించుకునేందుకు చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌కు మ‌రింత‌గా చేరువ‌య్యేందుకు ప్ర‌య‌త్నించారు.

ఈ నేప‌థ్యంలోనే ఈ శ్రేణులు ఎదిగేందుకు అడ్డుగా ఉన్న నాయ‌కుల‌పై వ్య‌తిరేకంగా క‌థ‌నాలు రాయించ‌డం, వాటిని ప్ర‌చారంలోకి తీసుకురావ‌డం ప‌రిపాటిగా మారిపోయింద‌న్న‌ది వంశీ లాంటి వాళ్ల ఆవేద‌న. తాజాగా వంశీ కూడా ఇవే ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని బ‌ట్టిపార్టీలో అంత‌ర్గ‌తంగా లోకేష్ కేంద్రంగా రాజ‌కీయాలు సాగుతున్నాయి. ఆయ‌న‌ను ప్ర‌మోట్ చేయ‌డం ద్వారా త‌మ ప‌నులు చేయించుకునేందుకు కొంద‌రు ప్ర‌త్యేకంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో ప్ర‌ధాన‌మైన క‌మ్మ వ‌ర్గంలోనే చీలిక‌లు వ‌చ్చాయి.

త‌న‌ను మెచ్చుకున్న వారే.. త‌న వార‌నే స్థాయిలో లోకేష్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కొన్నాళ్లుగా సీనియ‌ర్లు బుచ్చ‌య్య చౌద‌రి వంటి వారు అసంతృప్తితోనే ఉన్నారు. అంతెందుకు పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు చాలా మంది సీనియ‌ర్ల‌కు లోకేష్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌ని సంద‌ర్భాలున్నాయ‌ట‌. ఇక లోకేష్ రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా పొన్నూరు వెళ్లిన‌ప్పుడు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర లోకేష్‌ను క‌లిసేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌లేదు. దీనికి కార‌ణం అధికారంలో ఉన్న‌ప్పుడు లోకేష్ వ్య‌వ‌హ‌రించిన తీరే అట‌. అయితే, వీటిని చంద్ర‌బాబు లైట్ తీసుకున్న ఫ‌లితంగా అసంతృప్తి మ‌రింత‌గా పెరిగింది. ఇదే ఇప్పుడు వంశీ రూపంలో బ‌ద్ద‌లైందని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English