రానా వచ్చాడు.. సాయి పల్లవి వెళ్లిపోయింది

రానా వచ్చాడు.. సాయి పల్లవి వెళ్లిపోయింది

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ కోసం అమెరికా వెళ్లి తిరిగొచ్చిన రానా దగ్గుబాటి డిసెంబర్‌ నుంచి షూటింగ్స్‌లో పాల్గొంటాడు. అతను ముందుగా 'విరాటపర్వం' చిత్రాన్ని పూర్తి చేస్తాడు. రానా అవసరం లేని భాగాన్ని ఇప్పటికే చిత్రీకరించేసారు. డిసెంబర్‌లో రానాపై సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది.

అయితే ఈ టైమ్‌లో హీరోయిన్‌ అందుబాటులో వుండదు. సాయి పల్లవి డిసెంబర్‌ డేట్స్‌ని శేఖర్‌ కమ్ముల, నాగచైతన్య సినిమాకి ఇచ్చేసింది. జనవరిలో కానీ ఆమె 'విరాటపర్వం' సెట్స్‌లోకి రాదు. కనుక ఈలోగా రానాపై హీరోయిన్‌ అవసరం లేని సన్నివేశాలని చిత్రీకరిస్తారు. జనవరిలో హీరో హీరోయిన్‌ కాంబినేషన్‌ సీన్లు తీస్తారు. అలాగే పాటల చిత్రీకరణ కూడా అప్పుడే జరుపుతారు.

మార్చి నెలాఖరులో లేదా ఏప్రిల్‌ ప్రథమార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. 'నీదీ నాదీ ఒకే కథ' చిత్రాన్ని తెరకెక్కించిన వేణు ఉడుగుల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో సాయి పల్లవి లేడీ నక్సలైట్‌గా కనిపించనుంది. ఆచితూచి కథలు ఎంపిక చేసుకుంటోన్న సాయి పల్లవి ఎంతో ఇష్టపడి ఈ చిత్రాన్ని చేస్తోంది. రానాకి ఆరోగ్యం బాగున్నట్టయితే ఈ ఏడాదిలోనే ఈ చిత్రం విడుదలై వుండేది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English