లాదెన్ మా హీరో.. ఉగ్రవాదులను మేమే తయారుచేశాం: ముషారఫ్

లాదెన్ మా హీరో.. ఉగ్రవాదులను మేమే తయారుచేశాం: ముషారఫ్

పాకిస్తాన్ మాజీ నియంత అయిన పర్వేజ్ ముషారఫ్ మరోసారి తన బుద్ధిని చూపించారు. కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ తమ హీరో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిహాది కోసం పోరాడే ఉగ్రవాదులందరు పాక్‌ హీరోలంటూ ఆయన కొనియాడారు.

ఈ మేరకు ముషారప్‌ వ్యాఖ్యానించినట్లుగా పాక్‌ రాజకీయ నాయకుడు ఫర్‌హతుల్లా బాబర్‌ ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియోలో పాకిస్తాన్‌కు లాభం చేకూర్చే విధంగా ఆఫ్ఘనిస్తాన్‌లో 1979లో మతపరమైన మిలిటెన్సిని ప్రవేశపెట్టామని తద్వారా దేశంలోని సోవియేట్లను వెళ్లిపోయే విధంగా కృషి చేశామని ఫర్వేజ్ ముషారఫ్‌ అన్నారు.

‘ప్రపంచంలోని ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులందరిని ఏకం చేశాం. అప్పట్లో లష్కరే తోయిబా, ఆల్‌ఖైదా ఉగ్రవాదులను ప్రోత్సహించాం. పాక్‌కు వచ్చే కశ్మీరీలను హీరోలుగా గుర్తించాం. మేము వారికి పటిష్టమైన శిక్షణ ఇచ్చాం. భారత ఆర్మీతో పోరాడే కశ్మీరులను ముజాహుద్దీన్‌లుగా గుర్తించాం. అంతర్జాతీయంగా పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల తమ హీరోలు విలన్లయ్యారు’ అని ముషారఫ్‌ వ్యాఖ్యానించారు.

అయితే ఈ వీడియో ఎప్పటిది అనేది తెలియదు. ముషారఫ్ ఇంటర్వ్యూ క్లిప్ ను పాకిస్తాన్ రాజకీయ నాయకుడు ఫర్హతుల్లా బాబర్ బుధవారం ట్విట్టర్ లో షేర్ చేశారు. హక్కానీ, ఒసామా బిన్‌ లాడెన్ లు మా హీరోలు అని వీడియో క్లిప్‌లో ముషారఫ్ అన్నట్లు కన్పిస్తోంది. జమ్మూకశ్మీర్‌లో పాక్ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేందుకు ఉగ్రవాదులను ఉపయోగిస్తోందనడానికి ముషారఫ్ వీడియో క్లిప్ సాక్ష్యంగా నిలిచింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English