వల్లభనేని పదవికి రాజీనామా చేసి వెళ్తారా? చేయకుండా వెళ్తారా?

వల్లభనేని పదవికి రాజీనామా చేసి వెళ్తారా? చేయకుండా వెళ్తారా?

చంద్రబాబునాయుడు పరిస్థితి రోజురోజుకీ దీనావస్థకు చేరుతోంది. ఆయన వెంట బుడ్డోళ్లలా తిరిగిన నేతలూ ఆయనపై విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా ఆయన ఎంతగానో విశ్వసించే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు ప్రతి విధానమూ తప్పేనని.. జగన్ విధానాలు తనకు బాగా నచ్చాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఇటీవల గోదావరిలో మునిగిపోయిన పడవను ఎంతో కష్టపడి బయటకు తీసిన ధర్మాడి సత్యం పేరుతో చంద్రబాబును, టీడీపీని ఆయన ఏకిపడేశారు. తెలుగుదేశం పార్టీ మునిగిపోతున్న నావ అని.. దాన్ని ధర్మాడి సత్యం కూడా బయటకు తీయలేరని ఎద్దేవా చేశారు.

` జగన్ ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన కూడా పోకముందే అప్పుడే చంద్రబాబునాయుడు దీక్షలు చేస్తున్నారని వంశీ విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2014 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము కూడా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని హామీలు ఇచ్చామని అన్నారు. తాము  అధికారంలోకి  వచ్చిన తర్వాత ఎంతకాలం తర్వాత రైతు రుణమాఫీ మొదలుపెట్టామో, ఎన్ని దశలుగా చేశామో, ఎప్పటి వరకు చేశామో ప్రజలందరికీ తెలుసని అన్నారు. అదేవిధంగా డ్వాక్రా రుణమాఫీ గురించీ అందరికీ తెలుసని చెప్పారు. ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలని, ఆ పని చంద్రబాబు చేయలేదని, అందుకే, ప్రతిపక్ష నాయకుడి పాత్రను కూడా ఆయన పోషించలేకపోతున్నారని విమర్శించారు.

అనంతరం ఇసుక గురించి మాట్లాడుతూ... ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నదుల్లో ఇసుకను మనం తీయగలమా? వర్షాలు, వరదలు ఉన్న సమయంలో ఇసుకను బయటకు తీసే సాంకేతిక టెక్నాలజీ మన దగ్గర ఉందా? చంద్రబాబు సెల్ ఫోన్, కంప్యూటర్.. కనిపెట్టారని తమ మిత్రులందరూ చెబుతుంటారు కనుక, ఇలాంటి టెక్నాలజీని కూడా కనిపెట్టే శక్తిని భగవంతుడు ఆయనకు ఇవ్వాలని కోరుకుంటున్నానని సెటైర్లు వేశారు. మొత్తానికి చంద్రబాబును తీవ్రంగా విమర్శించి జగన్‌ను వెనకేసుకొచ్చిన వంశీ మరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్తారో.. రాజీనామా చేయకుండా వెళ్తారో.. లేదంటే బయట నుంచి సపోర్టు చేస్తూ తన దందాలకు వైసీపీ ప్రభుత్వం నుంచి ఇబ్బందుల్లేకుండా చూసుకుంటారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English