ఇంగ్లీష్ రావడం లేదు.. ఏటి సేస్తాం: బొత్స

ఇంగ్లీష్ రావడం లేదు.. ఏటి సేస్తాం: బొత్స

ఏపీలో పాలక, విపక్షాల మధ్య వాదప్రతివాదాలకు తావిచ్చిన ఇంగ్లీష్ మీడియం బోధనపై మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్య చేశారు. మూడుసార్లు మంత్రిగా పనిచేసిన తనకే ఇంగ్లీష్ రాదని.. ఇలాంటి ఇబ్బందులు భవిష్యత్ తరాలకు రాకూడదన్న ఉద్దేశంతోనే ఇంగ్లీష్ మీడియం బోధన అమలు చేయాలనుకుంటున్నామని ఆయన చెప్పారు.

ఇంగ్లీష్‌ నేటి పరిస్థితుల్లో అందరికి అవసరంగా మారిందని.. ఇంగ్లీష్‌ భాషపై పట్టులేకపోతే విద్యార్థులకు భవిష్యత్‌ ఎలా అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి బొత్స ప్రశ్నించారు. తన పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో చదవాలి, సామాన్యుల పిల్లలు చదవకూడదా అని ప్రశ్నిం చారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మాతృభాష మనుగడను కాపాడు కోవాలని, అదే క్రమంలో ఇంగ్లీష్‌ భాష నైపుణ్యాలు ఉంటే మంచిదన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.

జగన్‌ మట్టిలో కలిసిపోతారంటూ పవన్‌ కల్యాణ్‌ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతు న్నారని, రాజకీయాల్లో అంత ఆక్రోశం పనికిరాదని, సహనం ఉండాలని హితవు పలికారు. పవన్‌ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం బాగా పరిపాలిస్తోందని చంద్రబాబుకు, పవన్‌కు కడుపు మంట అని విమర్శించారు.

స్టార్టప్‌ ఏరియా వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయో జనాలు సింగపూర్‌ సంస్థలు సరిగ్గా చెప్పలేకపోయాయని, అందువల్లే పరస్పర అంగీకారంతో ఒప్పందం రద్దు చేసుకున్నామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ స్వయంగా చెప్పారన్నారు. రాష్ట్రంలో ఇతర రంగాల్లో పెట్టుబడి పెడతామని వారు ప్రకటించారని చెప్పారు. చంద్రబాబు ఇసుక దోచుకుని, ఇప్పుడు దీక్ష చేయడం విచిత్రంగా ఉందన్నారు.

మాతృభాషకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూనే ఆంగ్ల బోధన అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంటే దానిపై బురద జల్లుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌కు పవన్ వంతపాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు వెనక్కు మళ్లుతున్నాయని, రాజధాని స్టార్టప్ ఏరియా నుంచి సింగపూర్ తప్పుకుందని ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు తన హయాంలో బీఆర్ శెట్టి, మరో సంస్థ పెట్టుబడులకు ఎందుకు వెనక్కు తగ్గిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఐదేళ్ల పాటు ఇసుక మాఫియాకు ఆజ్యం పోశారని ఇప్పుడు కొంగ జపాలు.. దొంగ దీక్షలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
   

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English