శబరిమల కేసుపై తేల్చని సుప్రీం..

శబరిమల కేసుపై తేల్చని సుప్రీం..

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శబరిమల ఆలయంలోని అన్ని వయస్కుల మహిళల్ని అనుమతించే విషయంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని వయస్కుల మహిళల్ని ఆలయంలోకి అనుమతించే విషయంలో సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు తాజాగా విస్తృత ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయితో కూడిన ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం తాజాగా కేసును విచారించింది. బెంచ్ లోని అత్యధిక నా్యమూర్తులు తమ నిర్ణయానికి మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. మతంలో అంతర్గత భాగంగా ఉన్న విషయాలపై చర్చ జరపాలని పిటిషనర్లు కోరారని.. మతంలో ఉన్న వివిద వర్గాల వారికి వారు నచ్చిన రీతిలో విధానాల్ని ఆచరించే స్వేచ్ఛ ఉండాలని.. దీనికి సంబంధించిన అంశాల్లోకి చొచ్చుకుపోయే అధికారం కోర్టుకు ఉందా? అన్న అంశం ఇప్పుడు చర్చకు వచ్చిందన్నారు.

మత విధానాలు నైతికత ప్రజా ఆదేశాలకు భిన్నంగా ఉండకూడదని.. అందుకే ఈ అంశంపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు వీలుగా ఏడుగురు సభ్యులున్న సుప్రీం ధర్మాసనానికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ధర్మాసనంలో ఉన్న ముగ్గురు న్యాయమూర్తులు బలపర్చగా.. మరో ఇద్దరు వ్యతిరేకంచారు.

ఇదిలా ఉంటే.. శబరిమల ఆలయంలోని అన్ని వయస్కుల వారు దర్శనం చేసుకోవచ్చంటూ గత ఏడాది సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు విరుద్ధంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. అదే సమయంలో.. గత తీర్పును అమలుకు సంబంధించి స్టే విధించేందుకు సైతం సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English