2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న వ్యూహంతో బీజేపీ దూసుకొస్తోంది. ఇందుకు అనుగుణంగానే కార్యాచరణతో ముందుకు వస్తోంది. అధికార టీఆర్ఎస్ను ఇరుకున పడేసే ప్రతీ చిన్న అంశాన్ని కూడా వదలకుండా జనంలోకి బలంగా తీసుకెళ్తోంది. ఇదే సమయంలో ఇతర పార్టీల నేతలను కూడా లాగేస్తోంది.
ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీల నుంచేగాకుండా.. అధికార గులాబీ పార్టీ నుంచి కూడా పలువురిని పార్టీలోకి తీసుకుంది. ప్రధానంగా టీఆర్ఎస్ నేతలను టార్గెట్ గా చేసుకుని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే.. మైండ్‌గేమ్‌కు కూడా తెరలేపుతోంది. అదేమిటంటే.. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని పదేపదే చెప్పడం.
పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించిన తర్వాత బీజేపీ మరింత దూకుడు పెంచింది. ఆ జోష్‌ను మరింతగా పెంచుకుంటూ ముందుకు వస్తోంది. ఆ ఎన్నికల ఫలితాలతో ఇతర పార్టీల నుంచి కూడా పలువురు నేతలు బీజేపీలో చేరారు. అయితే.. గులాబీ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని రాష్ట్ర బీజేపీ నేతలు పదేపదే చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు ఎంపీ అర్వింద్‌ను కలవడంతో.. చేరికలు మొదలైనట్టేనని అందరూ అనుకున్నారు. కానీ, తాను కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని ఆ ఎమ్మెల్యే సెలవిచ్చారు. అయితే, వ్యూహాత్మకంగా చేరికను ఆపేశారా..? అనే అనుమానం కలుగుతోంది.
ఇక ఆ తర్వాత గత సెప్టెంబర్17న హైదరాబాద్‌కు పార్టీ అగ్రనేత అమిత్‌షా వస్తున్నారని, అదే రోజు తెలంగాణలో కీలక పరిణామాలు ఉంటాయని, ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు ఉంటాయని రాష్ట్ర బీజేపీ నేతలు అప్పట్లో హైప్ క్రియేట్ చేశారు. కానీ, ఆరోజు వచ్చింది..పోయింది.. ఇంతవరకూ ఎవరు కూడా చేరలేదు. ఇప్పుడు మళ్లీ అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ కొద్దిరోజుల క్రితం నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చెప్పారు. తాజాగా, హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇదంతా కమలదళం ఆడుతున్న మైండ్‌గేమ్‌లో భాగమేననే టాక్ కూడా వినిపిస్తోంది.
నిజానికి.. టీఆర్ఎస్ ప్రభుత్వం కొంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతోంది. పలువురు కార్మికులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. హైకోర్టు కూడా పలుమార్లు మందలించింది. ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజాసంఘాలతోపాటు సామాన్య ప్రజలు కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. ఒకవేళ.. టీఆర్ఎస్ను వీడాలని అనుకునే ఎమ్మెల్యేలకు ఇంతకన్నా మంచి సమయం దొరకదంటున్నారు. కానీ, ఎవ్వరు కూడా మాట కూడా మాట్లాడడం లేదు. అంతా సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. ఇదే టైంలో మరో నాలుగేళ్లు పార్టీ అధికారంలో ఉంటుంది.. అందేకే ఇప్పటికిప్పుడు పార్టీ మారితే పనులు ఆగుతాయన్న డౌట్‌తో మరికొందరు ఉన్నారట. దీంతో బీజేపీ నేతలు చెబుతున్న మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉందనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ముందుముందు ఏం జరుగుతుందో..?
నిజంగానే ఆ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారా..?
Nov 14, 2019
126 Shares
రాజకీయ వార్తలు
-
వైసీపీలోకి బాలకృష్ణ ఆప్త మిత్రుడు?
Dec 11,2019
126 Shares
-
దిశ తన తల్లిదండ్రులతో సఖ్యతగా లేదేమో..
Dec 11,2019
126 Shares
-
చంద్రబాబు వద్దు.. పవన్ ముద్దు
Dec 10,2019
126 Shares
-
ప్రతిపక్ష పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా - చంద్రబాబు
Dec 10,2019
126 Shares
-
బీజేపీలో చేరనున్న ఆనం రామనారాయణరెడ్డి?
Dec 10,2019
126 Shares
-
మంత్రులు, అధికారులకు చెక్ పెట్టిన జగన్
Dec 10,2019
126 Shares
సినిమా వార్తలు
-
సప్తగిరిని కాపీ కొట్టిన బన్నీ
Dec 12,2019
126 Shares
-
ఈ ఏడాది మొత్తంలో మనోడి సినిమానే హాట్ టాపిక్
Dec 12,2019
126 Shares
-
అక్కినేని-దగ్గుబాటి ఎడమొహం పెడమొహం!
Dec 12,2019
126 Shares
-
అక్కడ విజయ్ దేవరకొండదే రాజ్యం
Dec 12,2019
126 Shares
-
హీరోని కాదంటోన్న నాగచైతన్య!
Dec 12,2019
126 Shares
-
అది అత్త.. అల్లుడు, ఇది నాన్న.. కొడుకు!
Dec 12,2019
126 Shares