టీడీపీలో వియ్యంకుల వింత రాజకీయం

టీడీపీలో వియ్యంకుల వింత రాజకీయం

ఏపీలో తెలుగుదేశం పార్టీలో ఇద్దరు మాజీ మంత్రుల వ్యవహారం ఎవరికీ అంతుపట్టడం లేదు. వియ్యంకులైన ఆ ఇద్దరు నేతలు పార్టీ కార్యక్రమాలకు ఆమడ దూరం ఉంటున్నారు. వారే గంటా శ్రీనివాసరావు, పి.నారాయణ. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన వీరిద్దరూ పార్టీ తరఫున పోట్లాడేందుకే కాదు మాట్లాడేందుకూ ముందుకు రావడం లేదు. పైగా గంటా ఈరోజో రేపో టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారంటూ ప్రతి రోజూ పుకార్లు వినిపిస్తున్నాయి కానీ ఆయన వెళ్లడం లేదు, అలా అని పార్టీలో తిరగడమూ లేదు. తాజాగా ఆయన తన వియ్యంకుడినీ తనతో పాటు తీసుకెళ్తారన్న కొత్త ప్రచారం ఒకటి మొదలైంది.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2014 తరువాత గంటా, నారాయణలు అంతా తామే అన్నట్లుగా వ్యవహరించారు. వీరిలో నారాయణ ఎన్నికల్లో ఓడిపోగా... గంటా మాత్రం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరించే విషయంలో మాత్రం ఇద్దరూ ఓకే రకంగా వ్యవహరిస్తున్నారు.ఇప్పుడు వీరిద్దరి రాజకీయం ఎవరికీ అంతుపట్టడం లేదట.

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన పార్టీ మారడం దాదాపు ఖాయమనే టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే క్లారిటీ వస్తుందని విశాఖ జిల్లా రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీడీపీ వర్గాలు సైతం గంటా తమ పార్టీలో ఉంటారో లేదో తెలియదని చర్చించుకుంటున్నాయి.

మరోవైపు గంటా వియ్యంకుడు నారాయణ పార్టీ మారుతారని నిన్నమొన్నటి వరకు ప్రచారం లేకపోయినా తాజాగా ఆయన పేరూ వినిపిస్తోంది. ఆయన ఎన్నికల్లో ఓటమి తరువాత పూర్తిగా తన వ్యాపారాలకే పరిమితమైపోయారు. ఇటీవల టీడీపీ నాయకులు అమరావతిలో పర్యటించినప్పుడు వారితో కనిపించారు. మళ్లీ తరువాత కనిపించలేదు కానీ వియ్యంకుడితో పాటు ఆయన కూడా పార్టీ మారుతారన్న ప్రచారం మాత్రం బాగా వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English