జ‌గ‌న్ టీంలో వివాదాల ఎంపీ..!

జ‌గ‌న్ టీంలో వివాదాల ఎంపీ..!

రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో 22 చోట్ల వైసీపీ పాగా వేసింది. అది రాష్ట్ర చ‌రిత్ర‌లోనే అనూహ్యం. అయితే, 22 మంది ఎంపీలు కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు అత్యంత విధేయులు. అంతేకాదు, జ‌గ‌న్ ఏరికోరి ఒక‌రిద్ద‌రిని రాజ‌కీయాల‌తో సంబంధం లేక‌పోయినా.. ఎన్నిక‌ల బ‌రిలోకి దింపి త‌న శ‌క్తితో విజ‌యం అందించారు. ఇలా వ‌చ్చిన వారు కూడా ఎంపీలుగా విజ‌యం సాధించారు.

అయితే, ఎవ‌రూ కూడా వివాదం కాలేదు. ఒక్క నందిగం సురేష్ త‌ప్ప‌!వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎంతో ముచ్చ‌ట‌ప‌డి మ‌రీ సురేష్‌కు బాప‌ట్ల ఎంపీ టికెట్‌ను ఇచ్చారు. రాజ‌ధాని ప్రాంత‌మైన తుళ్లూరులో టీడీపీ అరాచ‌కాల‌ను ఎదుర్కొని నిల‌బ‌డ్డ ఓ సాధార‌ణ వ్య‌క్తిగా ఉన్న సురేష్ చేసిన పోరాటానికి ముచ్చ‌ట‌ప‌డీ మ‌రీ జ‌గ‌న్ ఎంపీ సీటు ఇచ్చారు. అదే స‌మ‌యంలో ఆర్థికంగా సాయం చేసి, ప్ర‌చారం చేసి మ‌రీ విజ‌యం ద‌క్కేలా చేశారు.

గ‌తంలో రోడ్డుపై ప‌నులు చేసుకునే త‌న‌ను జ‌గ‌న్ ఎంపీగా టికెట్ ఇచ్చి.. గెలిపించారంటూ.. సురేష్ అనేక సంద‌ర్భాల్లో బ‌హిరంగంగానే వెల్ల‌డించారు. మ‌రి అలాంటి నాయ‌కుడు,.. పార్టీకి ఎంత సేవ చేయాలి ?  పార్టీ అభివృద్దికి ఎంత మేర‌కు స‌హ‌క‌రించాలి ?  జ‌గ‌న్ విష‌యంలో ఎంత ఉదారంగా ఉండాలి ? అయితే, నందిగం సురేష్ మాత్రం ఇప్పుడు పార్టీలో ఏకు మేకైన చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. త‌న‌కు సంబంధం లేని నియోజక‌వ‌ర్గాల్లోనూ, త‌న‌కు ఎలాంటి అవ‌స‌రం లేని విష‌యాల‌లోనూ జోక్యం చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. బాప‌ట్ల ఎంపీగా గెలిచిన సురేష్ స్వ‌స్థ‌లం తాడికొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఉంది.

అయితే, తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం మాత్రం బాప‌ట్ల ప‌రిధిలోకి రాదు. అది గుంటూరు ఎంపీ ప‌రిధిలోకి వ‌స్తుంది. అయితే, త‌న సొంత ఏరియాలో త‌న ప‌ట్టు ఉండాల‌నే ఆధిప‌త్యంతో సురేష్ ఇక్క‌డి రాజ‌కీయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. అదే స‌మ‌యంలో ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఇసుక విష‌యంలో ఆయ‌న నేరుగా జోక్యం చేసుకుంటున్నారు. అయితే, ఇక్కడ ఇసుక వ్య‌వ‌హారం అంతా కూడా స్థానిక ఎమ్మెల్యే, లేదా మంత్రి ప‌రిధిలోకి వ‌స్తుంది. కానీ, సురేష్ మాత్రం అంతా తానే అయి వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

తాడికొండ ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కంటూ స‌ప‌రేట్ గ్రూప్ మెయింటైన్ చేస్తుండ‌డంతో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి, సురేష్‌కు మధ్య‌ తీవ్ర విభేదాలు న‌డుస్తున్నాయి. ఇక త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జోక్యం చేసుకుంటూ సురేష్ త‌న‌కు, పార్టీకి ఇబ్బందిగా మారాడాని శ్రీదేవి ఇప్ప‌టికే అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేసింది. అక్క‌డ నుంచి వార్నింగ్‌లు వ‌చ్చినా సురేష్ తీరు మాత్రం మార‌డం లేద‌ని టాక్‌. ఇక సురేష్ ఇసుక, క్ర‌ష‌ర్ల‌ వ్య‌వ‌హారాల్లో త‌ల‌దూర్చ‌డంతో వీటిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్న విప‌క్షాలు జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తున్నాయి.     

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English