క‌మ‌ల్‌, ర‌జ‌నీకి కూడా శివాజీ గ‌ణేష‌న్ గ‌తే.. కాక రేపిన ప‌ళ‌ని కామెంట్లు

క‌మ‌ల్‌, ర‌జ‌నీకి కూడా శివాజీ గ‌ణేష‌న్ గ‌తే.. కాక రేపిన ప‌ళ‌ని కామెంట్లు

త‌మిళ‌నాడులో రాజ‌కీయ వ‌ర్గాల్లో కాక‌పుట్టించే కామెంట్లు పేలుతున్నాయి. తాజాగా ద‌క్షిణాది అగ్ర హీరోలైన క‌మ‌ల్‌హాస‌న్‌, సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌పై ఆ రాష్ట్ర సీఎం ఎడ‌పాడి ప‌ళ‌నిస్వామి రాజ‌కీయ అజ్ఞానులంటూ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దూమారం రేపుతున్నాయి. ప‌నిలో ప‌నిగా ప‌ళ‌నిస్వామి నాటిత‌రం అగ్ర కథానాయ‌కుడు శివాజీ గ‌ణేష్‌న్ విఫ‌ల రాజ‌కీయ నాయకుడంటూ ఆడిపోసుకున్నాడు. వృద్ధాప్య ద‌శ‌కు చేరుకున్న క‌మ‌ల్, ర‌జ‌నీ వారి స్వార్థ‌పూరిత అవ‌స‌రాల మేర‌కే రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌ని ప‌ళ‌నిస్వామి ఫైర్ అయ్యారు. నిజంగానే వారికి ప్ర‌జాసేవ చేయాల‌నే త‌ప‌నే ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఆగార‌ని ప్ర‌శ్నించారు.

సేలం జిల్లా, నగర అన్నాడీఎంకే ప్ర‌తినిధుల‌తో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఓమలూరులో మంగళవారం స‌మీక్ష నిర్వ‌హించారు. అనంత‌రం ఆయన విలేక‌రుల‌తో మాట్లాడారు. క‌మ‌ల్ త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై అతిగా ఊహించుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు.  తమ పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని గొప్పలు చెప్పుకొంటున్న మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ ఇటీవలి లోక్‌స‌భ‌, ఉపఎన్నికల్లో ఎందుకు పోటీచేయ లేదో చెప్పాల‌ని ?  ప్రశ్నించారు. ఆయ‌న సినిమాలు ఎవ‌రూ చూడ‌టం లేదు. పార్టీ పెడితే క‌నీసం త‌మ పార్టీవారైనా చూస్తారనే ఆశతోనే కమల్‌హాసన్‌ మక్కల్‌ నీది మయ్యం స్థాపించాడ‌ని దెప్పి పొడిచారు.

నేను 1974లో అన్నాడీఎంకేలో చేరి పార్టీ కోసం 45 ఏళ్లపాటు పాటుపడ్డాను. ఎన్నో ప్ర‌జా పోరాటాలు చేశాను. ఎంతో క‌ష్ట‌ప‌డితే గాని సీఎం పీఠం ద‌క్క‌లేదు అంటూ చెప్పుకొచ్చారు. రజనీ, కమల్‌ వెండితెర నటులు, రాజకీయం తెలియదు. అస‌లు వారికి క‌నీసం రాష్ట్రంలో ఎన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు ఉన్నాయో తెలియ‌దంటూ ఘాటైన ఆరోప‌ణ‌లు చేశారు. ప్రజల సమస్యలపై అవగాహన లేకుండా పార్టీని స్థాపించిన శివాజీగణేశన్ చివ‌రికి ఎన్నికల సమయంలో ఏమైనారో అందరికీ తెలుసు’ అంటూ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ర‌జ‌నీ, క‌మ‌ల్‌ల ప‌రిస్థితి అదే విధంగా ఉంద‌ని అన్నారు. ప్ర‌జాసేవ‌లో ఉండాలంటే ఓపిక‌, నిస్వార్థం క‌లిగి ఉండాల‌ని పేర్కొన్నారు.

ఇక ప‌ళ‌నిస్వామి చేసిన వ్యాఖ్య‌ల‌పై సినీ అభిమానులు మండిప‌డుతున్నారు. కాళ్ల‌మీద ప‌డి ఎవరైనా ప‌ద‌వి తెచ్చుకోగ‌లరు.. సీఎం ప‌ద‌వీకాలం పూర్త‌యితే ఆయ‌న్ను ఎవ‌రూ గుర్తు పెట్టుకోరు. సినీ హీరోల విష‌యంలో అలా ఉండదు అంటూ విమ‌ర్శిస్తున్నారు.  సినీ నటులను తక్కువ చేసి మాట్లాడటం సీఎం స్థాయి వ్యక్తికి త‌గ‌ద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు ఈ సారి క‌మ‌ల్‌, ర‌జ‌నీల పార్టీలు కూడా ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌నుండ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్నా కొద్దీ త‌మిళ‌నాడులో వాడి వేడి విమ‌ర్శ‌లు పెరుగుతుండ‌టం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English