రెచ్చిపోయే ఛాన్సొచ్చింది.. ఇక ఆగుతుందా?

రెచ్చిపోయే ఛాన్సొచ్చింది.. ఇక ఆగుతుందా?

ఈషా రెబ్బా చాలా కాలం సగటు తెలుగు హీరోయిన్ లాగే సాగిపోయింది. చాలా ట్రెడిషనల్‌గా కనిపిస్తూ.. అలాంటి పాత్రలే ఎంచుకుంటూ.. తెరమీద పద్ధతిగా కనిపిస్తూ ఉన్న ఆమెకు చెప్పుకోదగ్గ స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇలా ఉంటే కెరీర్లో ఏ ఎదుగుదలా ఉండదని.. ఆమె రూటు మార్చింది. ఇంతకుముందున్న తెలుగు హీరోయిన్లలా మడికట్టుకు కూర్చోలేదు. గ్లామర్ డోస్ పెంచింది.

తన లుక్ మార్చుకోవడమే కాదు.. అప్పీయరెన్స్ కూడా మార్చింది. హాట్ హాట్ ఫొటో షూట్లెన్నో చేసింది. కొన్నిసినిమాల్లో సెక్సీగా కనిపించింది. అయినప్పటికీ ఒక స్థాయికి మించి ఎదగలేకపోయింది. గ్లామర్ విందు చేద్దామని ఆమెకు ఉన్నా.. అందుకు తగ్గ అవకాశాలు సినిమాల్లో రాలేదు.

ఇలాంటి సమయంలోనే ఈషా రెచ్చిపోవడానికి సరైన అవకాశం దక్కింది. ఆమెకు తెలుగు ‘లస్ట్ స్టోరీస్’లో నటించే ఛాన్సొచ్చింది. హిందీలో ఇదే పేరుతో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. బాలీవుడ్లో ఈషాలాగే ట్రెడిషనల్ హీరోయిన్ లాగా కనిపించిన కియారా అద్వానీ ఇందులో చాలా బోల్డ్‌గా నటించి కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఆ వెబ్ సిరీస్‌తో కియారా కెరీరే మారిపోయింది. మంచి మంచి అవకాశాలొచ్చాయి.

టాప్ లెవెల్‌ దిశగా దూసుకెళ్తోంది. తెలుగు ‘లస్ట్ స్టోరీస్’ కూడా తన ఫేట్‌ను అలాగే మార్చేస్తుందని ఈషా ఆశతో ఉంది. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఇటీవలే తెలుగు ‘లస్ట్ స్టోరీస్’ మొదలైంది. ఈషా మీద షాట్ తీస్తున్న ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. తెలుగులో కూడా అంతే బోల్డ్‌గా ఈ వెబ్ సిరీస్‌ను తీస్తే.. ఈషా అలా రెచ్చిపోతే కుర్రాళ్లలో ఆమెకు మంచి క్రేజ్ రావడం ఖాయం. మరి ఈ తెలుగు పిల్ల కుర్రకారును ఎలా రెచ్చగొడుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English