జగన్ గారూ.. నా మూడు పెళ్లిళ్ల వల్లే మీరు జైలుకెళ్లారా?

జగన్ గారూ.. నా మూడు పెళ్లిళ్ల వల్లే మీరు జైలుకెళ్లారా?

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడాన్ని తప్పుబట్టినందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ట్విట్టర్లో పవన్ ఇప్పటికే స్పందించాడు. హుందాగా సమాధానం చెప్పాడు. ఈ రోజు విజయవాడకు వచ్చిన పవన్ జగన్ వ్యాఖ్యలపై మీద ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడాడు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోరుకున్నట్లుగా పవన్ కాస్త దూకుడుగానే మాట్లాడాడు. కాకపోతే ఎక్కడా నోరు మాత్రం జారలేదు. పవన్‌ను విమర్శిస్తూ అతడికి ముగ్గురు భార్యలంటూ జగన్ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై పవన్ సూటిగా జగన్‌ను ప్రశ్నించాడు. ‘‘జగన్ రెడ్డి గారూ.. నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్లే మీరు జైలుకెళ్లారా? నా మూడు పెళ్ళిళ్ళ వల్లే విజయ్ సాయిరెడ్డి సూట్ కేస్ కంపెనీలు పెట్టి జైలుకు వెళ్లాడా?’’ అని పవన్ సూటిగా అడిగాడు. తన గురించి జగన్ పద్ధతిగా మాట్లాడాలని పవన్ హెచ్చరించాడు. ‘‘జగన్ రెడ్డి గారూ.. విజయవాడ నడిబొడ్డున కూర్చుని చెప్తున్నా. మీ ఫ్యాక్షనిజం ధోరణికి భయపడేవాడిని కాదు. మీకు వేల కోట్లు ఉండొచ్చు. నా గురించి పద్ధతిగా మాట్లాడండి’’ అని పవన్ అన్నాడు. జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా పడితే అలా మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి తమది తెలుగుదేశం పార్టీ కాదని పవన్ వ్యాఖ్యానించడం విశేషం.

ఏపీలో 90 వేల మందికి పైగా ఉన్న ఉపాధ్యాయులకు అసలు శిక్షణే ఇవ్వకుండా ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం కల్పించకుండా ఉన్నట్లుండి ఇంగ్లిష్ మీడియంకి మార్చేస్తాం అంటే ఎలా అన్న పవన్.. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉంటేనే పిల్లలు త్వరగా నేర్చుకోగలరు అన్నది యునెస్కో, ఆక్స్‌ఫర్డ్ అధ్యయనాల్లో తేలిందని.. ప్రాథమిక దశలో ఉండే విద్యార్థులకు ఉన్నట్లుండి ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తే రెంటికీ చెడ్డ విధంగా వాళ్ల పరిస్థితి తయారవుతుందని.. పసన్ ఆందోళన వ్యక్తం చేశాడు.ఇంగ్లిష్ ప్రపంచ భాష అని.. దాని ప్రాధాన్యాన్ని ఎవరూ తక్కువ చేయలేరని.. కానీ హేతుబద్ధత లేకుండా ఏదీ చేయకూడదని పవన్ అభిప్రాయపడ్డాడు.
 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English