సాక్షిని ఇరుకున పెట్టేసిన పవన్

సాక్షిని ఇరుకున పెట్టేసిన పవన్

రాజకీయాలతో ముడిపడ్డ ఎవరైనా ఒక కామెంట్ చేసేటపుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే. ఈ సోషల్ మీడియా కాలంలో ప్రతిదీ నోట్ చేసి పెడతారు జనాలు. ఒకసారి తీసుకున్న స్టాండ్‌కు, చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా వ్యవహరిస్తే పాత చరిత్ర అంతా తవ్వి తీసి ఇరుకున పెట్టడానికి నెటిజన్లు సిద్ధంగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని జగన్మోహన్ రెడ్డి సర్కారు హఠాత్తుగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో విమర్శలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే.

ఈ నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఐతే విషయంపై మాట్లాడకుండా పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయాన్ని ఎత్తి చూపుతూ విమర్శలు చేయడం పట్ల దుమారం రేగుతోంది. ఐతే దీనికి పవన్ ఆవేశపడిపోకుండా హుందాగా స్పందించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

గతంలో మాతృభాషా దినోత్సవం సందర్భంగా  తెలుగు భాష గురించి.. దాని పరిరక్షణ గురించి జగన్ చేసిన ట్వీట్‌ను బయటికి తీశాడు పవన్. అంతేకాక తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియం తీసేసి ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టాలన్న నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టడాన్ని పవన్ గుర్తు చేశాడు.

దీంతో పాటు నారాయణ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తూ సాక్షి ప్రచురించిన వార్తా కథనాల తాలూకు క్లిప్సింగ్స్‌ను పవన్ పంచుకున్నాడు. ఇప్పటికిప్పుడు ఇంగ్లిష్ మీడియమా అంటూ సాక్షి పెద్ద పెద్ద హెడ్డింగ్స్‌తో కథనాలు ఇచ్చింది. ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి పెద్ద పెద్ద హెడ్డింగ్స్‌తో తమ నిర్ణయాన్ని తప్పుబడుతూ వార్తలు ఇస్తున్నాయంటూ జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం. మరి జగన్ సొంత మీడియా అప్పుడు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంపై అంత గొడవ చేసి ఇప్పుడు అదే నిర్ణయంపై స్టాండ్ మార్చుకోవడంపై సోషల్ మీడియా విసిరే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English