ట్రంప్ షాకిచ్చి ఇండియ‌న్ల‌కు తీపిక‌బురు చెప్పిన కోర్టు

ట్రంప్ షాకిచ్చి ఇండియ‌న్ల‌కు తీపిక‌బురు చెప్పిన కోర్టు

ఆంక్ష‌ల ప‌రంప‌ర‌..షాకుల ఒర‌వ‌డికి సుప‌రిచిత చిరునామా అయిన అమెరికా నుంచి ఓ తీపిక‌బురు వినిపించింది. అయితే, అది నేరుగా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌భుత్వం నుంచి కాదు. ఆయ‌న స‌ర్కారుకు వ్య‌తిరేకంగా కోర్టు ఇచ్చిన తీర్పు వ‌ల్ల‌. ఈ తీర్పుతో మెజార్టీ ల‌బ్ధిదారులు భార‌తీయులే. హెచ్-4 వీసాదారు లు అమెరికాలో పనిచేసుకొనేందుకు కొలంబి యా సర్క్యూట్ కోర్టు అనుమతినిచ్చింది. దీంతో, అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులకు తాత్కాలిక ఊరట లభించింది.  అమెరికాలో 1.2 లక్షల మంది హెచ్-4 వీసాదారులు ఉద్యోగాలు చేస్తున్నట్టు అంచనా.

అమెరికాలో హెచ్1బీ వీసాపై పనిచేసే విదేశీ నిపుణుల జీవిత భాగస్వాములకు పని అనుమతి కోసం 2015లో అప్పటి అధ్యక్షుడు బ‌రాక్‌ ఒబామా హెచ్-4 వీసా విధానాన్ని ప్రవేశపెట్టారు. హెచ్-1బీ వీసా కలిగి ఉండి గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నిస్తున్న విదేశీయుల జీవిత భాగస్వాములకు ఈ వీసాలు మంజూరు చేస్తారు. ఈ హెచ్‌4 వీసాల‌ ద్వారా వారు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతులు క‌ల్పించారు. ఈ విధానం భారతీయులకు భారీ లబ్ధి చేకూర్చింది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ అనుమతులను రద్దుచేశారు. అమెరిక‌న్ల అవ‌కాశాల‌ను హెచ్4 వీసా గండికొడుతోంద‌ని ఆరోపించారు. దీంతో పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఇలాంటి కోర్టులోనే తాజాగా తీర్పు వెలువ‌డింది.

యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్స్ కొలంబియా సర్క్యూట్స్‌లో అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌డుతూ దాఖలైన వ్యాజ్యాలపై  విచారణ జరిగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు త్రిసభ్య ధర్మాసనం ప్రకటించింది.ఈ కేసులో తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని దిగువ కోర్టుకు సూచించింది. దీంతో హెచ్-4 వీసాదారులకు పని అనుమతులను పునరుద్ధరించినట్టయింది.

హెచ్-4 వీసాల విష‌యంలో గ‌త ఏడాది ఓ ఆస‌క్తిక‌ర నివేదిక వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మొత్తం హెచ్‌4 వీసాల్లో భారతీయులకే అత్యధికంగా దక్కాయని ఒక నివేదిక వెల్లడించింది. హెచ్-4 వీసా పొందిన వారిలో ఐదింట ఒకవంతు మంది కాలిఫోర్నియాలోనే పనిచేస్తున్నట్టు తెలిపింది. హెచ్-4 వీసా కింద పనిచేసేందుకు అనుమతి పొందినవారిలో మహిళలే 93 శాతం మంది ఉన్నారని పేర్కొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English