బీజేపీ మ‌హా ప్లాన్‌తో శివ‌సేన ఖేల్ ఖ‌త‌మే..!

బీజేపీ మ‌హా ప్లాన్‌తో శివ‌సేన ఖేల్ ఖ‌త‌మే..!

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పాత మిత్ర‌ప‌క్షం అయిన శివ‌సేన త‌మ‌కు చుక్క‌లు చూపించ‌డంతో బీజేపీ ఆ ఘోర అవ‌మానం త‌ట్టుకోలేక‌పోతోంది. ఓ విధంగా జాతీయ రాజ‌కీయాల‌ను పూర్తిగా గుప్పిట్లో పెట్టుకునేందుకు వేస్తోన్న ఎత్తులు వ‌రుస‌గా స‌క్సెస్ అవుతుండ‌డంతో మాంచి జోష్‌లో ఉన్న బీజేపీకి మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన ఇచ్చిన షాక్‌తో కోలుకోలేక‌పోతోంది. మిత్ర‌ప‌క్షంగా ఉంటూనే శివ‌సేన చేసిన న‌మ్మ‌క ద్రోహానికి బీజేపీ బ‌దులు తీర్చుకోనుందా ?  ఇందుకోసం ? అక్క‌డ ధీర్ఘ‌కాలిక వ్యూహం అమ‌లు చేయ‌బోతోందా ?  శివ‌సేన‌ను చ‌రిత్ర‌లో శిథిలం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా కొత్త ఎత్తుగ‌డ‌లు వేస్తోందా ? అంటే ఢిల్లీ రాజ‌కీయాల్లో ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే ఆన్స‌ర్లు వ‌స్తున్నాయి.

105 సీట్లు ఉండి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌మ‌ని ఆహ్వానించినా కూడా ఆ పార్టీ అందుకు ఒప్పుకోకుండా ప్ర‌తిప‌క్షంలో కూర్చునేందుకే ఇష్ట‌ప‌డ‌డం వెన‌క పెద్ద ప్లానే దాగి ఉంద‌ని తెలుస్తోంది. ముందుగా శివ‌సేన ఎంపీ సంజ‌య్‌రౌత్‌తో మాట్లాడించిన ఆ పార్టీ అధినేత ఉద్ద‌వ్ థాక్రే ఆ త‌ర్వాత తానే స్వ‌యంగా మాట్లాడ‌డం కూడా బీజేపీ జాతీయ నాయ‌క‌త్వానికి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. అటు ఎన్సీపీతో మంత‌నాలు చేయ‌డం కూడా బీజేపీకి ఎంత మాత్రం న‌చ్చ‌లేదు.

ఇక ప్ర‌భుత్వ ఏర్ప‌టుకు ముందు ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిపిన బీజేపీ జాతీయ, మ‌హారాష్ట్ర నాయ‌కులు శివ‌సేన బెదిరింపుల‌కు లొంగ‌కూడ‌ద‌ని... ఒక‌వేళ శివ‌సేన కాంగ్రెస్‌, ఎన్సీపీతో క‌లిసి ప్ర‌భుత్వ ఏర్పాటు చేశాక ఆ ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని డిసైడ్ అయ్యారు. పూర్తి వైరుధ్య భావాలున్న కాంగ్రెస్‌, శివ‌సేన క‌లిస్తే దీనిని బీజేపీ త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుని మహారాష్ట్రలో ఏకైక హిందుత్వ పార్టీగా బిజెపి నిలిచేందుకు వ్యూహం ప‌న్న‌నుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

శివ‌సేన న‌మ్మ‌క ద్రోహంతో పాటు ఆ మూడు పార్టీల అప‌విత్ర క‌ల‌యిక‌ను సైతం ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాల‌న్న‌దే బీజేపీ బిగ్ స్కెచ్ అట‌. వాస్త‌వానికి ఆర్టికల్ 370 రద్దుతో బిజెపికి పెరిగిన ఇమేజీని శివసేన షేర్ చేసుకుందన్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఇక క‌ర్నాట‌క‌లో త‌క్కువ సీట్లు వ‌చ్చిన జేడీఎస్‌కు సీఎం పీఠం ఇచ్చి ఆ త‌ర్వాత చేతులు ఎత్తేసిన కాంగ్రెస్‌.. ఇప్పుడు శివ‌సేన‌కు మ‌ద్ద‌తు ఇచ్చినా కూడా ఆ ప్ర‌భుత్వం నిల‌బ‌డ‌ద‌ని... పైగా మూడు సైద్దాంతిక విబేధాలు ఉన్న మూడు పార్టీలు క‌లిసి ఎన్నో రోజులు ప్ర‌భుత్వం న‌డ‌ప‌లేవ‌ని కూడా బిజెపి భావిస్తోంది. అందుకే ఇప్పుడు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి శివ‌సేన చెప్పిన‌ట్టు తోక ఆడించ‌డం క‌న్నా.. ఆ త‌ర్వాత ప‌రిణామాలు అనుకూలంగా మ‌లుచుకుని శివ‌సేన‌ను తొక్కేయ‌డ‌మే ల‌క్ష్యంగా వెళ్లాల‌ని భావిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English